సిక్సర్‌పై నజర్

జట్టు నిండా స్టార్లు.. పవర్ హిట్టర్లు, యార్కర్లు సంధించే పేసర్లు, పేస్ ఆల్‌రౌండర్లు, అనుభవజ్ఞులైన కోచ్‌లు.. ఇవన్నీ కలగలిసిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్లో తిరుగులేని శక్తిగా వెలుగొందుతున్నది.
ఇప్పటికే ఐదుసార్లు టైటిల్ ఎగరేసుకుపోయి టోర్నీ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్‌గా ఉన్న రోహిత్‌సేన మరోసారి సత్తాచాటి సిక్సర్ కొట్టాలని తహతహలాడుతున్నది. గత రెండు సీజన్లలో విజేతగా నిలిచిన ముంబై హ్యాట్రిక్‌పై గురిపెట్టింది. కుర్రాళ్లు మంచి ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు మరింత జోష్ ఇస్తున్నది.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9న ప్రారంభం కానున్న ఈ ఏడాది ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా తొలి మ్యాచ్‌తోనే పోరు మొదలుపెట్టనున్న ముంబై ఇండియన్స్ బలాలు, బలహీనతలపై కథనం..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
‘ముంబై ఇండియన్స్‌ను ఓడించడం ఏ జట్టుకైనా చాలా కష్టం’ ఇది క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఇటీవల అన్న మాట. స్టార్లతో జట్టు అత్యంత బలంగా ఉండడంతో పాటు ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ముంబైకి చెందిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్ల ప్రదర్శన చూసి సన్నీ ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆ జట్టు సైతం ఆ ధీమాతోనే ఉంది. ఇప్పటికే ఐపీఎల్లో టైటిల్ సాధించడం అలవాటుగా మార్చుకున్న ముంబై ఇండియన్స్ టైటిళ్ల సిక్సర్‌పై కన్నేసింది. గత రెండు సీజన్లు సహా ఇప్పటికే ఐదుసార్లు విజేతగా నిలిచిన ఆ జట్టు వరుసగా మూడోసారి టైటిల్ కొట్టాలని కసిగా ఉంది. రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్, కిషన్‌తో పాటు స్టార్ ఆల్‌రౌండర్లు కీరన్ పొలార్డ్, హార్దిక్, కృనాల్ పాండ్యలతో ముంబై బ్యాటింగ్.. ప్రత్యర్థి జట్లను భయపెట్టేలా ఉంది. ఒకవేళ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే రోహిత్‌సేనకు ఎంత లక్ష్యమిచ్చినా మిగలదేమోనని జట్లు ఆందోళన చెందే పరిస్థితి ఉంది. మరోవైపు యార్కర్ కింగ్ బుమ్రా, బౌల్ట్, కుల్టర్నైల్తో ముంబై విభాగం కూడా బలోపేతంగా కనిపిస్తున్నది. బంతితో నాలుగు ఓవర్లు వేసి బ్యాటింగ్‌లో ధనాధన్ హిట్టింగ్ చేసే పొలార్డ్, హార్దిక్, కృనాల్.. మరింత బలం. ఏప్రిల్ 9న ముంబై, బెంగళూరు మధ్య మ్యాచ్‌తోనే ఈ ఏడాది ఐపీఎల్ 14వ సీజన్‌కు తెరలేవనుంది.
బలాలు:
- కరోనా వైరస్ ఆందోళన మధ్య యూఏఈలో జరిగిన ఐపీఎల్- 2020 టైటిల్‌ను సైతం దక్కించుకోవడంతో జట్టు ఆత్మవిశ్వాసం తారస్థాయిలో ఉండడం. టైటిల్ ఫేవరెట్ల జాబితాలో ముందుండడం.
- ధనాధన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, డికాక్‌తో కూడిన పటిష్టమైన ఓపెనింగ్. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పొలార్డ్, పాండ్య బ్రదర్స్‌తో బ్యాటింగ్ అత్యంత బలోపేతంగా ఉండడం.
- యార్కర్ కింగ్ బుమ్రా, సూపర్ ఎక్స్‌ప్రెస్ బౌల్ట్‌కు.. కుల్టర్‌నైల్, ఆడమ్ మిల్నె జతకలవడంతో మరింత పటిష్టమైన పేస్విభాగం.
- ముంబైకి రోహిత్ సారథ్యం ఎంతో బలం. 2012 వరకు టైటిల్ గెలువని ఆ జట్టు అతడి సారథ్యంలో ఆ తర్వాత ఐదుసార్లు దక్కించుకుంది. అలాగే సుదీర్ఘ కాలంగా ఎక్కువ మంది ఆటగాళ్లు జట్టుతో ఉండడం కూడా ముంబైకి కలిసివస్తున్న అంశం.
బలహీనతలు
స్పిన్ విభాగం పటిష్టంగా లేకపోవడం. చెన్నై పిచ్‌పై ఇది ప్రతికూలంగా మారే అవకాశం.
స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్ తుదిజట్టులో ఉండడం దాదాపు ఖాయం కావడంతో 156 ఐపీఎల్ వికెట్లు ఖాతాలో ఉన్న సీనియర్ పియూష్ చావ్లాకు చోటివ్వడం కష్టంగా మారడం.
ముంబై ప్రధాన జట్టు బలంగా ఉన్నా బ్యాటింగ్‌లో ముఖ్యమైన ఆటగాడు గాయపడితే సరైన ప్రత్యామ్నాయాలు లేకపోవడం. బెంచ్‌లో ఎక్కువగా అనుభవం లేని ప్లేయర్లే ఉండడం.
భారత ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), బుమ్రా, కృనాల్ పాండ్య, పియూష్ చావ్లా, రాహుల్ చాహర్, ఆదిత్య తరే, అన్మోల్ప్రీత్ సింగ్, అనుకూల్ రాయ్, అర్జున్ టెండూల్కర్, ధవల్ కులకర్ణి, జయంత్ యాదవ్, సౌరభ్ తివారి, యుధ్వీర్ సింగ్, మొహ్సిన్ ఖాన్
విదేశీ ప్లేయర్లు: ఆడమ్ మిల్నె, క్రిస్ లిన్, జేమ్స్ నీషమ్, కీరన్ పొలార్డ్, మార్కో జాన్సెన్, కుల్టర్‌నైల్,
డికాక్, బౌల్ట్.
ఈ ఏడాది వేలంలో ముంబై దక్కించుకున్న ప్లేయర్లు:
పియూష్ చావ్లా (స్పిన్నర్, రూ.2.4కోట్లు), కుల్టర్‌నైల్ (ఆల్‌రౌండర్, రూ.5కోట్లు), మిల్నె (బౌలర్, రూ.3.2 కోట్లు), నీషమ్ (ఆల్‌రౌండర్, రూ.50లక్షలు), యుధ్వీర్ చరక్ (ఆల్‌రౌండర్, రూ.20లక్షలు), మార్కో జాన్సెన్ (ఆల్‌రౌండర్, రూ.20లక్షలు), అర్జున్ టెండూల్కర్ (ఆల్‌రౌండర్
రూ.20 లక్షలు)
ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శన:
(విజేత)
2013
2015
2017
2019
2020
ఇవి కూడా చదవండి:
ఓవరాల్ చాంప్ అండమాన్ నికోబార్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

