Coco Gauff : అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ (Coco Gauff) యూఎస్ ఓపెన్ (US Open)లో సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన ఫైనల్లో నంబర్ 1 అరీనా సబలెంకా (Aryna Sabalenka)ను ఓడించింది. దాంతో, 19 ఏళ్లకే మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకుంది. అయితే.. టెన్నిస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న గాఫ్ అసలు పేరు, ఆమె జీవితంలో టర్నింగ్ పాయింట్.. వంటి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు బోలెడున్నాయి.
నయా చాంపియన్ గాఫ్ క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించింది. అవును ఆమె తండ్రి కొరే గాఫ్(Corey Gauff) బాస్కెట్ బాల్ ప్లేయర్. జార్జియా స్టేట్ తరఫున ఆయన పలు టోర్నీల్లో ఆడాడు. ఇక తల్లి క్యాండీ గాఫ్(Candy Gauff) ఒక ట్రాక్ అథ్లెట్. మరో విషయం ఏంటంటే..? గాఫ్ మొదటి పేరు కొరీ గాఫ్(Cori Gauff).
తల్లిదండ్రులతో గాఫ్
అయితే.. తండ్రి పేరు ఆమె పేరు ఒకేలా ఉండడంతో వాళ్ల ఆంటీ ఒకరు కొకొ అని నిక్‌నేమ్‌తో పిలవడం మొదలెట్టింది. అప్పటి నుంచి అదే పేరు స్థిరపడింది. గాఫ్ మొదట్లో బాస్కెట్ బాల్ ఆడేది. అయితే.. ఆ ఆటకు గుడ్ బై చెప్పేసి రాకెట్ పట్టింది.
అప్పటికే మహిళల టెన్నిస్‌లో దిగ్గజాలుగా ఎదిగిన అమెరికా నల్లకలువలు సెరెనా విలియమ్స్(Serena Williams), వీనస్ విలియమ్స్(Venus Williams) మ్యాచ్‌లను ఆసక్తిగా చూసేది. అలా 15 ఏళ్లకే టెన్నిస్‌లో సంచలనం సృష్టించింది. 2019 వింబుల్డన్(Wimbledon 2019) టోర్నీలో వీనస్ విలియమ్స్‌ను ఓడించి తన పేరు మార్మోగేలా చేసింది. ఐదుసార్లు చాంపియన్ అయిన వీనస్‌ను తొలిరౌండ్లో గాఫ్ 6-4, 6-4 పాయింట్ల తేడాతో మట్టికరిపించింది.
నిరుడు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన గాఫ్ ఇగా స్వియటెక్ చేతిలో కంగుతిన్న విషయం తెలిసిందే. అయితే.. ఈసారి మాత్రం ఈ అమెరికా టీనేజర్ పట్టువిడవలేదు. సొంత అభిమానుల మద్దుతుతో ఫైనల్లో గాఫ్ చెలరేగి ఆడింది. సుమారు 2 గంటల 6 నిమిషాల పాటు జరిగిన టైటిల్ పోరులో అరీనా సబలెంకాను 2-6, 6-3, 6-2 పాయింట్ల తేడాతో చిత్తు చేసింది.
Coco Gauff went from being a kid in the stands to a US Open champion.
Anything is possible. pic.twitter.com/1kce1ANO6E
— US Open Tennis (@usopen) September 9, 2023
చిన్నప్పుడు యూఎస్ ఓపెన్ మ్యాచ్‌లు చూసి గెంతులు వేసిన గాఫ్ ఇప్పుడు అదే కోర్టులో చాంపియన్‌గా అవతరించింది. అందుకనే కాబోలు సబలెంకపై చివరి పాయింట్ సాధించాక ఆమె భావోద్వేగానికి లోనైంది. ఉబికివస్తున్న కన్నీళ్లను దిగమింగుతూనే ప్రేక్షకులకు అభివాదం చేసింది. అంతేకాదు తనకు ఎల్లవేళలా వెన్నంటి ఉన్న తండ్రి కొరే గాఫ్‌కు ఆమె కృతజ్ఞతలు చెప్పింది.