Srilanka | వన్డేల్లో శ్రీలంక జైత్రయాత్ర.. 13 విజయాలతో దక్షిణాఫ్రికాను వెనక్కి నెట్టేసింది
Srilanka : ఆసియా కప్(Asia cup 2023) సూపర్ 4లో శ్రీలంక(Srilanka) అదరగొడుతోంది. నిన్న రాత్రి బంగ్లాదేశ్ (Bangladesh)పై ఆతిథ్య జట్టు అద్భుత విజయం సాధించింది. దాంతో, వన్డేల్లో వరుసగా 13 వ విజయం ఖాతాలో వేసుకుంది. ఈ ఫార్మాట్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రెండు జట్టుగా చరిత్ర...
Srilanka : ఆసియా కప్(Asia cup 2023) సూపర్ 4లో శ్రీలంక(Srilanka) అదరగొడుతోంది. నిన్న రాత్రి బంగ్లాదేశ్ (Bangladesh)పై ఆతిథ్య జట్టు అద్భుత విజయం సాధించింది. దాంతో, వన్డేల్లో వరుసగా 13 వ విజయం ఖాతాలో వేసుకుంది. ఈ ఫార్మాట్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రెండు జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు 12 విజయాలతో రెండో స్థాన దక్షిణాఫ్రికా(South Africa)ను వెనక్కి నెట్టింది. 2005 నుంచి 2006 మధ్య సఫారీ జట్టు ఈ ఫీట్ సాధించింది. ప్రస్తుతం 50 ఓవర్ల ఆటలో వరుస విజయాల రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. రికీ పాంటింగ్ సారథ్యంలోని కంగారు జట్టు ఆ ఏడాది ఏకంగా 21 మ్యాచుల్లో గెలుపొందింది.
ఈ ఏడాది జూన్ నుంచి శ్రీలంక జైత్రయాత్ర మొదలైంది. అఫ్గనిస్థాన్‌పై వన్డే సిరీస్‌లో గెలుపొందిన లంక ఆ తర్వాత జింబాబ్వేలో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్(World Cup Qualifiers 2023)లో కొనసాగించింది. వరుస విజయాలతో ఫైనల్‌కు చేరింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్‌ను ఓడించి ట్రోఫీ అందుకుంది.

అంతేకాదు వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించింది. నిన్న కొలంబోలో బంగ్లాదేశ్‌పై లంక 21 పరుగుల తేడాతో గెలిచింది. సమరవిక్రమ 93 కుశాల్ మెండిస్(50) అర్థ శతకాలతో చెలరేగడంతో లంక మొదట 257 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లా పోరాడినా ఫలితం లేకపోయింది. దసున్ శనక, పథిరన, థీక్షణ మూడేసి వికెట్లు తీయడంతో ఆ జట్టు 231 రన్స్‌కే కుప్పకూలింది.
ఇవి కూడా చదవండి
Coco Gauff | యూఎస్ ఓపెన్‌లో దుమ్మురేపిన యువ సంచలనం.. 19 ఏళ్లకే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్
Asia Games 2023 | ఆసియా గేమ్స్‌కు ముందు బెంగళూరులో భారత క్రికెటర్ల క్యాంప్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

