US Open women’s tennis | అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ (Coco Gauff) యూఎస్ ఓపెన్ (US Open) గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో బెలారస్‌కు చెందిన ప్రపంచ రెండో సీడ్ అరీనా సబలెంకా (Aryna Sabalenka)ను ఓడించి 19 ఏళ్లకే తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. సుమారు 2 గంటల 6 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అరీనా సబలెంకాను 2-6, 6-3, 6-2 పాయింట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక నిరుడు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన ఈ 19 ఏండ్ల యంగ్‌స్టర్.. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.
The moment you dream of! pic.twitter.com/5ua6u8mnXq
— US Open Tennis (@usopen) September 9, 2023
ఇదిలా ఉండగా.. 1999లో సెరెనా విలియమ్స్ తర్వాత యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ గెలిచిన తొలి అమెరికన్ టీనేజర్‌గా కోకో గాఫ్ చరిత్ర సృష్టించింది.
Coco isn’t next. She’s now. pic.twitter.com/cRZ0MeuedE
— US Open Tennis (@usopen) September 9, 2023
The moment you become a Grand Slam champion. 🥹 pic.twitter.com/AsQwN1eXl4
— US Open Tennis (@usopen) September 9, 2023
మరోవైపు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) యూఎస్ ఓపెన్ సెమీఫైనల్లో పరాజయం పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో శనివారం టాప్ సీడ్ అల్కరాజ్ 6-7 (3/7), 1-6, 6-3, 3-6తో మూడో సీడ్ డానియల్ మెద్వెదెవ్ చేతిలో ఓడాడు.
Another great show at the #USOpen from Carlos Alcaraz!
See you next year! 👋 pic.twitter.com/jsZJCO8Vqb
— US Open Tennis (@usopen) September 9, 2023
దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన సుదీర్ఘ పోరులో అల్కరాజ్ ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోగా.. మెద్వెదెవ్ 9 ఏస్‌లతో విజృంభించాడు. 45 విన్నర్లు సంధించిన అల్కరాజ్ 38 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. మరో సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 6-2, 7-6తో బెన్ షెల్టన్ (అమెరికా)పై సునాయాసంగా గెలిచి ఫైనల్‌కు చేరాడు. ఆదివారం జరుగనున్న తుదిపోరులో మెద్వెదెవ్‌తో జొకోవిచ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.