Rohit Sharma : వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరో ఫీట్ సాధించాడు. వన్డేల్లో 50వ అర్ధ శతకం నమోదు చేశాడు. దాంతో, హిట్‌మ్యాన్ ఆస్ట్రేలియా దిగ్గజం మార్క్ వా(Mark Waugh) రికార్డు సమం చేశాడు. ఆసియా కప్(Asia Cup 2023)లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్(Pakistan)పై ఈ డాషింగ్ ఓపెనర్ (56 : 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాదాడు.
షాదాబ్ ఖాన్(Shadab Khan) ఓవర్లో భారీ సిక్సర్ కొట్టి ఫిఫ్టీకి చేరువయ్యాడు. పాకిస్థాన్‌పై అతడికి ఇది 7వ అర్ధ శతకం కావడం విశేషం. విధ్వసంక క్రికెటర్‌గా పేరొందిన రోహిత్‌కు వన్డేల్లో గొప్ప రికార్డు ఉంది. ఈ స్టార్ బ్యాటర్ ఈ ఫార్మాట్లో ఏకంగా మూడు డబుల్ సెంచరీ(Double Century)లు బాదాడు.
ఆస్ట్రేలియా దిగ్గజం మార్క్ వా
5⃣0⃣th ODI FIFTY! 🙌 🙌
Captain Rohit Sharma marches past the half-century in 42 balls 👌 👌
Follow the match ▶️ https://t.co/kg7Sh2t5pM#TeamIndia | #AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/HDpd0yj16N
— BCCI (@BCCI) September 10, 2023
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ పాక్ పేసర్లను ఉతికారేశాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(58 : 52 బంతుల్లో 10 ఫోర్లు)తో కలిసి తొలి వికెట్‌కు 121 రన్స్ జోడించాడు. ధాటిగా ఆడే క్రమంలో షాదాబ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి ఔటయ్యాడు.