హైదరాబాద్, ఆట ప్రతినిధి: గ్రామీణ క్రీడారంగాన్ని బలోపేతం చేసే ఆలోచనతో తీసుకురాబోతున్న సీఎం కప్ టోర్నీకి రంగం సిద్ధమవుతున్నది. బుధవారం పెద్దపల్లిలో సీఎం కప్ జెర్సీ, బ్రౌచర్, ట్రోఫీని సీఎం రేవంత్రెడ్డి అధికారికంగా ఆవిష్కరించారు. ఈనెల 7 నుంచి జనవరి 2వ తేదీ వరకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దాదాపు 36 క్రీడాంశాల్లో పోటీలు జరుగనున్నాయి.
టోర్నీలో పోటీపడే ప్లేయర్లు సీఎం కప్ గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టం(జీఎంఎస్) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీబాలదేవి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.