మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో నాలుగో సీడ్ స్టిఫనోస్ సిట్సిపాస్ (గ్రీస్) క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిట్సిపాస్ 4-6, 6-4, 4-6, 6-3, 6-4తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో మెద్వెదెవ్ 6-2, 7-6, (7/4), 6-7 (4/7), 7-5తో క్రెస్సీపై గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మహిళల సింగిల్స్‌లో సిమోనా హలెప్‌కు చుక్కెదురవగా.. కనెపి, స్వియాటెక్, కార్నెట్, కొలిన్స్ క్వార్టర్స్‌కు చేరారు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో హలెప్ 4-6, 6-3, 4-6తో కార్నెట్ చేతిలో ఓడగా.. స్వియాటెక్ 5-7, 6-3, 6-3తో క్రిస్టియాపై గెలిచి ముందంజ వేసింది.