Chris Gayle : వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ (Chris Gayle) ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ఓ సంచలనం. అతడు క్రీజులోకి వచ్చాడంటే బౌలర్లు వణికిపోయేవాళ్లు. దంచడమే డ్యూటీగా భావించే ఈ డాషింగ్ బ్యాటర్ నెలకొల్పిన రికార్డులు కోకొల్లలు. క్రికెటర్‌గా తన విధ్వంసక ఆటతో అభిమానులను అలరించిన గేల్.. ఈమధ్య తన ప్రత్యేక వేషధారణతో వైరలవుతున్నాడు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కరీబియన్ వీరుడు డ్రాగన్ వేషంలో.. కార్నివాల్ డాన్స్ వీడియోతో మరోసారి నెట్టింటిని షేక్ చేస్తున్నాడు.
ఆల్‌టైమ్ దిగ్గజ ఓపెనర్లలో ఒకడైన క్రిస్ గేల్ కొత్త ఏడాది సందర్బంగా తమ ప్రాంత విశిష్టతను ప్రపంచానికి చాటాడు. డ్రాగన్ వేషధారణతో హుషారుగా డాన్స్ చేస్తూ మురిసిపోయాడీ యూనివర్సల్ బాస్. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫుక్రి గ్వాన్ 2026’ పేరుతో షేర్ చేసిన వీడియోలో కరీబియన్ మూలాలతో గిల్ కనిపించాడు. ఈ పదానికి ‘ఏం జరుగుతోంది?’ అని అర్థం. పక్షి రెక్కలను పోలిన డ్రాగన్ బొమ్మలను ధరించిన గిల్.. చేతిలో పొడవాటి కర్రతో చిందులు వేశాడు. మైదానంలో తన డేరింగ్ ఆటకు కేరాఫ్ అయిన ఈ మాజీ ఓపెనర్.. ఇప్పుడు సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాడు.
జమైకాకు చెందిన గేల్ 1999లో క్రికెట్లో అరంగేట్రం చేశాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో అనతికాలంలోనే డేంజరస్ బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించాడు. విండీస్ జట్టు 2004లో చాంపియన్స్ ట్రోఫీ, 2012, 2016లో టీ20 వరల్డ్ కప్ చాంపియన్‌గా నిలవడంలో గేల్ కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా కెరీర్లో 19,593 రన్స్ కొట్టిన ఈ కరీబియన్ వీరుడి ఖాతాలో 147 హాఫ్ సెంచరీలు, 42 సెంచరీలు ఉన్నాయి.
Players Will Come And Go, But We Will Never Get A Character Like Chris Gayle Again👌
Enjoy Some Best Memories Of Universe Boss @henrygayle 🔥🔥 pic.twitter.com/Fv5QRQYsNt
— Khan (@Khanmohammed12) December 18, 2025
స్లిప్‌లో మెరుపు ఫీల్డర్‌గా పేరొందిన గేల్ 240 క్యాచ్‌లు పట్టాడు. ఈ సిక్సర్ల కింగ్ టెస్టుల్లో 331, వన్డేల్లో 98 సార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. ఆడినంత కాలం తన మార్క్ ఇన్నింగ్స్‌లతో ఫ్యాన్స్‌ను అలరించిన గేల్ 2019లో 50 ఓవర్ల ఫార్మాట్‌కు, 2021లో టీ20లకు వీడ్కోలు పలికాడు. 2022లో ఈ స్టార్ క్రికెటర్ ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్పేశాడు.