హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : మల్టీపుల్ క్లబ్స్ వివాదంలో హెచ్‌సీఏ తాతాలిక అధ్యక్షుడు దల్జీత్‌సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజు, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్‌పై హెచ్‌సీఏ మాజీ కార్యవర్గ సభ్యుడు చిట్టి శ్రీధర్ సోమవారం సీఐడీకి ఫిర్యాదు చేశారు. 2018లో హెచ్‌సీఏకు క్లబ్‌లు చెల్లించే వార్షిక రెన్యువల్ ఫీజును రెండు క్లబ్‌లకు చెక్‌ల రూపంలో దల్జీత్ సింగ్ స్వయంగా సంతకాలు చేసి చెల్లించినట్లు తెలిపారు. అమీర్‌పేట్ క్రికెట్ క్లబ్, ఖల్సా క్రికెట్ క్లబ్ పేరిట ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు చెందిన రెండు చెక్‌లను దల్జీత్‌సింగ్ వార్షిక ఫీజుల కోసం ఇచ్చిన్నట్లు ఆధారాలు ఉన్నాయని, వాటిని సీఐడీకి సమర్పించినట్లు తెలిపాడు.
మొత్తం 57 మల్టీపుల్ క్లబ్‌లపై చర్యలు తీసుకున్నప్పుడు దల్జీత్ క్లబ్‌లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని శ్రీధర్ ప్రశ్నించారు. ఇటువంటి ఆరోపణల నడుమ దల్జీత్‌కు తాతాలిక అధ్యక్షుడిగా కొనసాగే నైతిక హకు లేదని చెప్పారు. ప్రస్తుత సంయుక్త కార్యదర్శి బసవరాజు 2023 వరకు కమర్షియల్ ట్యాక్స్‌లో పనిచేసి, ఆ క్లబ్ తరఫున ప్రాతినిధ్యం వహించారని చెప్పారు. 2023లో రిటైరవ్వగానే నిబంధనలకు విరుద్ధంగా అమీర్‌పేట్ క్లబ్‌కు ఉపాధ్యక్షుడై ఆ ఏడాది జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసినట్లు చెప్పారు. సునీల్ అగర్వాల్ కౌన్సిలర్‌గా ఉంటూ అతడి కొడుకు కుశ్ అగర్వాల్‌ను హైదరాబాద్ జట్టుకు ఆడించడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.