King Kohli | రన్ మెషీన్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచుల్లో మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన కోహ్లీ ఆట తీరుపై అభిమానులు సంతోసంతో ఉన్నారు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించిన కోహ్లీ.. ఇవాల నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చెలరేగిపోయాడు.
ఇవాల్టి మ్యాచ్‌లో కోహ్లీ అభిమాని ఒకరు ప్రదర్శించిన పోస్టర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆట జరుగుతుండగా ఓ ఫ్యాన్ ప్రదర్శించిన పోస్టర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూపడంతో మ్యాచ్ తిలకిస్తున్న వారంతా ఒక్కసారిగా ఆయనపై దృష్టి నిలిపారు. తన అభిమాన క్రికెటర్‌ను అందనంత ఎత్తులో ఉంచాలనుకుని ‘రోబో చిట్టి + క్రిష్ + బాహుబలి = కింగ్ కోహ్లీ’ అని ఫొటోలు అతికించిన పోస్టర్ తయారుచేశారు. ఈ పోస్టర్‌ను చూసిన కోహ్లీ కూడా ముసిముసిగా నవ్వుకోవడం కనిపించింది.
కాగా, ఇవాల్టి మ్యాచ్‌లో మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకున్నది. నెదర్లాండ్స్‌లో మ్యాచ్ జరుగుతుండగా.. ఓ ప్రేమ జంట ప్రేక్షకుల సాక్షిగా ఒక్కటైంది. మ్యాచ్ తిలకించేందుకు వచ్చిన ఓ యువకుడు తన లవర్‌కు ప్రపోజ్ చేసి.. ఆమె ఆనందంతో ఓకే అనగానే మ్యారేజ్ రింగ్ తొడిగి సంభ్రమాశ్చర్యానికి గురిచేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.