టోక్యో: ఒలింపిక్స్ 4×200 మీటర్ల రిలే ఈవెంట్లో చైనా అమ్మాయిలు సంచలనం సృష్టించారు. ఈ ఈవెంట్ హాట్ ఫేవరెట్స్ అయిన అమెరికా, ఆస్ట్రేలియాలను వెనక్కి నెట్టడమే కాదు.. ఏకంగా వరల్డ్ రికార్డుతో గోల్డ్ మెడల్ గెలిచారు. చైనాకు చెందిన యాంగ్ జున్జువాన్, ఝాంగ్ యుఫెయి, లి బింగ్జీ, తాంగ్ ముహాన్ టీమ్.. 7 నిమిషాల 40.33 సెకన్లలో ఈ రిలేను పూర్తి చేయడం విశేషం. అమెరికా (7:40.73), ఆస్ట్రేలియా (7:41.29) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
1996లో తొలిసారి ఈ ఈవెంట్ ఒలింపిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా కాకుండా మరో టీమ్ గోల్డ్ గెలవడం ఇదే తొలిసారి. అయితే ఇప్పుడీ మూడు టీమ్స్ గత వరల్డ్ రికార్డ్ టైమ్ (7:41.50)లోపే ఉండటం విశేషం. గతంలో వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో ఆస్ట్రేలియా ఈ రికార్డు సెట్ చేసింది. చివరి లెగ్‌లో అమెరికా స్టార్ స్విమ్మర్ కేటీ లెడెక్కీ టీమ్‌ను గోల్డ్ వైపు నడిపించేలా కనిపించినా.. చివరికి చైనానే గోల్డ్ మెడల్ గెలిచింది.