Paris Olympics | పారిస్ ఒలింపిక్స్‌లో చైనా పసిడి బోణీ కొట్టింది. పోటీల తొలి రోజైన శనివారం జరిగిన 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ద్వారా చైనా మొదటి స్వర్ణాన్ని ముద్దాడింది. ఆఖరి వరకు ఆసక్తిరంగా సాగిన పసిడి పోరులో చైనా ద్వయం హువాంగ్ యటింగ్, షెంగ్ లివాహో 16-12తో కొరియా జంట కెయు జిహ్యున్, పార్క్ హజున్పై అద్భుత విజయం సాధించారు.
పాయింట్ పాయింట్‌కు ఇరు దేశాల షూటర్ల మధ్య ఆసక్తికర పోరు జరిగింది. అంతకముందు జరిగిన క్యాంస పోరులో అలెగ్జాండ్రా లె, స్టపయెవ్..కజకిస్థాన్‌కు తొలి పతకాన్ని అందించారు. మరోవైపు డైవింగ్‌లో చైనా మరో స్వర్ణాన్ని దక్కించుకుంది. దశాబ్దాలుగా డైవింగ్‌లో తమదైన ఆధిపత్యం కొనసాగిస్తున్న చైనా అదే అనవాయితీని కొనసాగించింది.