టోక్యో ఒలింపిక్స్‌లో చైనా స్విమ్మర్లు ప్రపంచ రికార్డు సృష్టించారు. మహిళల 4X 200 మీటర్ల ఫ్రీ స్టయిల్ రిలే ఈవెంట్లో 7 నిమిషాల 40.33 సెకన్లలోనే గమ్యాన్ని చేరి కొత్త రికార్డు నెలకొల్పడమే గాక ఈ పోటీలలో ఇప్పటిదాకా ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా, ఆస్ట్రేలియాను వెనక్కినెట్టి స్వర్ణ పతకం సాధించారు. తాజా రికార్డుతో 2019లో ఆస్ట్రేలియా నెలకొల్పిన 7 నిమిషాల 41.29 సెకన్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. గురువారం నాటి పోటీలో అమెరికా రజత పతకం నెగ్గగా ఆస్ట్రేలియా కాంస్యంతో సరిపెట్టుకుంది. 1996లో ఈ ఈవెంట్‌ను ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టిన తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా తప్ప మరో జట్టు విజయం సాధించలేదు.ఈత కొలనులో చైనా సునామీ