షెన్జెన్ (చైనా): భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్, మాళవిక బన్సోద్ చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్‌లో సింధు 21-17, 21-19తో బుసానన్ (థాయ్‌లాండ్)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. బుసానన్‌తో జరిగిన 21 మ్యాచ్‌లలో సింధుకు ఇది 20వ విజయం కావడం విశేషం.
మరో పోరులో 36వ ర్యాంకర్ మాళవిక 20-22, 23-21, 21-16తో తనకంటే మెరుగైన ర్యాంక్ (21) కలిగిన డెన్మార్క్ షట్లర్ హోజ్మర్క్కు షాకిచ్చింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్.. 21-14, 13-21, 21-13తో జియాను ఓడించాడు.