Hockey Asia Cup : భారత్ ఆతిథ్యమిస్తున్న పురుషుల హాకీ ఆసియా కప్(Hockey Asia Cup 2025)లో సూపర్ 4 బెర్తులు ఖరారాయ్యాయి. గ్రూప్ ‘ఏ’ నుంచి ఫేవరెట్ భారత జట్టుతో పాటు చైనా క్వాలిఫై అయింది. గ్రూబ్ ‘బీ’ నుంచి కొరియా, మలేషియాలు మెగాటోర్నీలో మరో దశకు అర్హత సాధించాయి. సోమవారం జపాన్‌పై ఉత్కంఠ డ్రాతో చైనా.. బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి కొరియా సూపర్ 4లోకి దూసుకొచ్చాయి.
స్వదేశంలో రాజ్‌గిర్ వేదికగా జరుగుతున్న హాకీ ఆసియా కప్‌లో భారత్ అదరగొడుతోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్స్ వర్షం కురిపిస్తుండడంతో వరుసగా రెండు మ్యాచుల్లో గెలుపొందిన టీమిండియా సూపర్ 4కు అర్హత సాధించింది. సోమవారం చైనా అతికష్టమ్మీద జపాన్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.
𝐂𝐡𝐢𝐧𝐚 𝐚𝐝𝐯𝐚𝐧𝐜𝐞! ✅
A fighting 2-2 draw vs Japan seals China’s spot in the Super 4s of the Hero Asia Cup, Rajgir, Bihar 2025.
🇨🇳 2-2 🇯🇵#HumSeHaiHockey #HeroAsiaCupRajgir pic.twitter.com/Y67mlNlsCS
— Hockey India (@TheHockeyIndia) September 1, 2025
కొరియా సంచలన ఆటతో బంగ్లాదేశ్‌ను 5-1తో చిత్తుగా ఓడించి ముందంజ వేసింది. మరో మ్యాచ్‌లో మలేషియా బలమైన చైనీస్ తైపీని మట్టికరిపించింది. అష్రన్ హంసనీ, అఖీముల్లా అనౌర్ తలా ఒక గోల్ చేయడంతో మలేషియా ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రత్యర్ధి డిఫెన్స్‌ను ఛేదిస్తూ మలేషియా ఆటగాళ్లు వరుసగా గోల్స్ చేయగా 15-0 తో గెలుపొంది సూపర్ 4 బెర్తు సాధించింది. సూపర్ 4, 5వ, 8వ స్థానాలకు సంబంధించిన ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 3 నుంచి మొదలవుతాయి.