IND vs SA | భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. పుజారా క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇప్పటికే కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ క్యాచ్ అవుట్ అయిన విషయం తెలిసిందే.
జాన్సెన్ వేసిన బౌలింగ్‌లో వెర్రియెన్నెకు క్యాచ్ ఇచ్చి పుజారా వెనుతిరిగాడు. 77 బంతుల్లో పుజారా 43 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. విరాట్ కోహ్లీ, పుజారా ఇద్దరి భాగస్వామ్యంతో స్కోర్ హాఫ్ సెంచరీని దాటేసింది. ఇద్దరూ కలిసి 62 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ 81 బంతుల్లో 19 పరుగులు చేశాడు.
ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, అజింక్యా రహనే ఉన్నారు. 38 ఓవర్లలో భారత్.. 3 వికెట్లు నష్టపోయి.. 100 పరుగుల మార్క్‌ను క్రాస్ చేసింది. మరోవైపు దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా, ఒలివియర్, జాన్సెన్ తలో వికెట్ తీశారు.
That's a fine 50-run partnership between @cheteshwar1 & @imVkohli 👏👏
— BCCI (@BCCI) January 11, 2022
Live – https://t.co/rr2tvBaCml #SAvIND pic.twitter.com/ZGWcnYrtl2