Cheteshwar Pujara : వెస్టిండీస్ పర్యటనతో భారత క్రికెట్ బోర్డు టెస్టు జట్టులో మార్పులకు శ్రీకార చుట్టింది. వరుసగా విఫలమైతున్న సీనియర్ ఆటగాళ్లపై కఠినంగా వ్యహరించింది. అందుకు నయా వాల్ ఛటేశ్వర్ పూజారా(Cheteshwar Pujara)పై వేటు ఓ ఉదాహరణ. రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) వారసుడిగా ప్రశంసలు అందుకున్న పూజారాకు ఇది నిజంగా మింగుడుపడని విషయమే. అలాగని ఈ టెస్టు స్పెషలిస్ట్ బ్రేక్ తీసుకోవాలని అనుకోవడం లేదు. దులీప్ ట్రోఫీ(Duleep Trophy)కి సిద్ధమవుతున్నాడు. ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
ఆ ట్వీట్లో లవ్ క్రికెట్ అనే అర్థం వచ్చేలా హార్ట్ సింబల్, క్రికెట్ బ్యాట్ ఫొటో ఉంది. ప్రస్తుతం పుజారా ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ చూసిన ఫ్యాన్స్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నారు. మరికొందరు ‘నీ కెరీర్ ముగిసిపోలేదు’, ‘చాంపియన్ ఆటగాడు.. చెక్కుచెదరన ఏకాగ్రత’ అని కామెంట్లు రాస్తున్నారు.
🏏 ❤️ pic.twitter.com/TubsOu3Fah
— Cheteshwar Pujara (@cheteshwar1) June 24, 2023
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) పుజారా తీవ్రంగా నిరాశ పరిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టైటిల్ పోరులో రెండు ఇన్నింగ్స్‌ల్లో తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. అప్పటివరకు ఇంగ్లండ్ గడ్డపై కౌంటీల్లో పరుగుల వరద పారించిన అతను ఫైనల్లో తేలిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో సహా కోట్లాది మంది అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేశాడు. దాంతో, శివసుందర్ దాస్(Shiv Sunder Das) నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అతడిపై కఠినంగా వ్యవహరించాలనుకుంది. అందుకనే నయా వాల్‌కు ఉద్వాసన పలికింది. దాంతో, దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో పరుగులు సాధించి పూజరా తన సత్తా నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా అతడితో కలిసి వెస్ట్ జోన్‌కు ఆడనున్నాడు. విండీస్ టూర్లో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది. మొదటి టెస్టు జూలై 12న మొదలవ్వనుంది.