Lionel Messi | పీఎస్జీ క్లబ్ వాతావరణంలో ఇమడలేకపోయా.. మెస్సీ షాకింగ్ కామెంట్స్
Lionel Messi : లెజెండరీ ఫుట్‌బాలర్, అర్టెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) వచ్చే సీజన్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్ తరఫున తొలి మ్యాచ్ ఆడేందుకు ఆతృతగా ఉన్నాడు. ఈమధ్యే పీఎస్జీ(Paris Saint-Germain)ను వీడిన ఈ స్టార్ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పీఎస్జీ ....
Lionel Messi : లెజెండరీ ఫుట్‌బాలర్, అర్టెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) వచ్చే సీజన్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్ తరఫున తొలి మ్యాచ్ ఆడేందుకు ఆతృతగా ఉన్నాడు. ఈమధ్యే పీఎస్జీ(Paris Saint-Germain)ను వీడిన ఈ స్టార్ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పీఎస్జీ వాతావరణంలో ఇమడలేకపోయానని, పెద్ద సంఖ్యలో అభిమానులతో విభేదాలు చవిచూశానని మెస్సీ తెలిపాడు.
‘పీఎస్జీ క్లబ్‌తో కొనసాగిన రోజులు కష్టంగా గడిచాయి. నాతో పాటు కుటుంబసభ్యులు కూడా అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు ఇబ్బంది పడ్డారు. మరోవిషయం ఏంటంటే..? అక్కడివాళ్లు నన్ను ఓరకంగా చూసేవాళ్లు. అది నేను అస్సలు ఊహించలేదు’ అని మెస్సీ వెల్లడించాడు. అంతేకాదు ఆ క్లబ్ ఫ్యాన్స్‌లో చాలామంది తనతో విభేదించేవాళ్లని ఈ వరల్డ్ కప్ హీరో అన్నాడు.
భార్యా పిల్లలతో మెస్సీ

జూన్ 30న ఆఖరి మ్యాచ్
ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకడైన మెస్సీ 2021లో పీఎస్జీతో రెండేళ్ల కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. జూన్ 30న అతడు ఆ క్లబ్ తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. ఆ క్లబ్ తరఫున మెస్సీ 28 గోల్స్ చేశాడు. ఆ తర్వాత.. వచ్చే సీజన్లో అతడు ఏ క్లబ్‌కు వెళ్తాడనే ప్రశ్నలు ఊపందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానగణం ఉన్న మెస్సీని దక్కించుకునేందుకు స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా(Barcelona), సౌదీ అరేబియా క్లబ్ అల్ – హిలాల్(Al Hilal ) క్లబ్స్ ప్రయత్నించాయి. కానీ, మెస్సీ అమెరికాకు చెందిన ఇంటర్ మియామికి ఓకే చెప్పాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

