Cheteshwar Pujara: డబుల్ సెంచరీతో దిగ్గజాల సరసన పుజారా.. దేశవాళీ క్రికెట్లో తోపు రికార్డులు సొంతం..
Cheteshwar Pujara: జార్ఖండ్‌తో మ్యాచ్‌లో ద్విశతకం చేయడం ద్వారా పుజారా.. దేశవాళీ క్రికెట్లో దిగ్గజాల సరసన చేరాడు. దేశవాళీ క్రికెట్లో పుజారాకు జార్ఖండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ 61వది.
Cheteshwar Pujara: టీమిండియా బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా జాతీయ జట్టులో చోటు కోల్పోయినా దేశవాళీలో మాత్రం సత్తా చాటుతున్నాడు. ఇటీవలే మొదలైన రంజీ ట్రోఫీలో భాగంగా.. రాజ్‌కోట్ వేదికగా జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీ (356 బంతుల్లో 243 నాటౌట్, 30 ఫోర్లు) చేయడంతో అతడు తిరిగి జాతీయ జట్టులో పునరాగమనం చేసే౦దుకు బలమైన పునాదులు వేసుకున్నాడు. కాగా జార్ఖండ్‌తో మ్యాచ్‌లో ద్విశతకం చేయడం ద్వారా పుజారా.. దేశవాళీ క్రికెట్లో దిగ్గజాల సరసన చేరాడు. దేశవాళీ క్రికెట్లో పుజారాకు జార్ఖండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ 61వది. తద్వరా అతడు లెజెండరీ ప్లేయర్ విజయ్ హజారే పేరిట ఉన్న 60 శతకాల రికార్డును అధిగమించాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో భాగంగా భారత్ నుంచి అత్యధిక సెంచరీలు సాధించినవారిలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్లు ముందున్నారు. ఈ ఇద్దరూ 81 సెంచరీలు సాధించారు. మూడో స్థానంలో ప్రస్తుత భారత జట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ (68) ఉన్నాడు. ఆ తర్వాత పుజారా (61), విజయ్ హజారే (60), వసీమ్ జాఫర్ (57), దిలీప్ వెంగ్‌సర్కార్ (55), వీవీఎస్ లక్ష్మణ్ (55) ఉన్నారు.
అత్యధిక ద్విశతకాలు..
రంజీ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసినవారిలో పుజారా రెండో స్థానంలో ఉన్నాడు. పరాస్ డోగ్రా అత్యధికంగా 9 ద్విశతకాలు సాధించగా పుజారా.. 8 డబుల్ హండ్రెడ్స్ సాధించాడు. అజయ్ శర్మ, అభినవ్ ముకుంద్ లు ఏడు ద్విశతకాలు చేయగా సురేంద్ర భావె, అశోక్ మల్హోత్రలు ఆరు సార్లు డబుల్ సెంచరీలు చేశారు. ఓవరాల్‌గా పుజారాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇది 17వ డబుల్ సెంచరీ కావడం విశేషం.
The moment when Cheteshwar Pujara completed his 200…!!!
– What a way to kick off 2024 Ranji Trophy season.pic.twitter.com/cS8z9l983C
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2024
భారత్‌లోనే గాక ఇంగ్లండ్ తరఫున కౌంటీలలో కూడా ఆడే పుజారా.. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ 37 సార్లు డబుల్ సెంచరీలు చేయగా ఇంగ్లండ్‌కు చెందిన వాలీ హ్యామండ్ (36), ఎలియాస్ హెన్రీ (22) ఉన్నారు. 17 ద్విశతకాలతో పుజారా.. మార్క్ రామ్‌ప్రకాశ్, హెర్బర్ట్ సుట్క్లిఫ్లతో కలిసి ఫోర్త్ ప్లేస్‌లో నిలిచాడు.
వీవీఎస్ రికార్డూ మాయం..
జార్ఖండ్‌తో మ్యాచ్‌లో 161 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పుజారా.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పరుగుల పరంగా వీవీఎస్ లక్ష్మణ్‌ను దాటాడు. హైదరాబాదీ మాజీ బ్యాటర్ 267 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 19,730 పరుగులు చేయగా తాజాగా పుజారా.. లక్ష్మణ్‌ను అధిగమించాడు. భారత్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసినవారిలో సునీల్ గవాస్కర్ (25,834) అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో సచిన్ (25,396), మూడో స్థానంలో రాహుల్ ద్రావిడ్ (23,794), నాలుగో స్థానంలో పుజారా (19,812) ఉన్నాడు. లక్ష్మణ్ ఐదో స్థానానికి పడిపోయాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

