IPL 2024 | ‘ఫ్లయింగ్ కిస్’ పేసర్‌పై నిషేధం.. ఈసారి ఏం చేశాడంటే..?
IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో కోల్‌కతానైట్ రైడర్స్ పేసర్ హర్షిత్ రానా (Harshit Rana) తన ఓవరాక్షన్‌తో వార్తల్లో నిలుస్తున్నాడు. . ఈసారి ఏకంగా మ్యాచ్ ఫీజు మొత్తం కోల్పోవడమే కాకుండా ఒక్క మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు.
IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో కోల్‌కతానైట్ రైడర్స్ పేసర్ హర్షిత్ రానా (Harshit Rana) తన ఓవరాక్షన్‌తో వార్తల్లో నిలుస్తున్నాడు. ఒకటి రెండు వికెట్లు తీసి నానా హంగామా చేస్తున్న ఈ స్పీడ్‌స్టర్.. మరోసారి ఐపీఎల్ కోడ్‌ను ఉల్లంఘించాడు. ఈసారి ఏకంగా మ్యాచ్ ఫీజు మొత్తం కోల్పోవడమే కాకుండా ఒక్క మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు.
అసలేం జరిగిందంటే..? సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్(Mayank Agarwal)కు ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చి విమర్శల పాలైన హర్షిత్.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై తన బుద్ది చూపించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో అభిషేక్ పొరెల్(Abhishek Porel)ను బౌల్డ్ చేసిన ఈ పేసర్ మునపటిలా ఫ్లయింగ్ కిస్ ఇవ్వబోయాడు. కానీ, తమాయించుకొని పొరెల్‌కు డగౌట్ దారి చూపించాడు.
WATCH 📽️
Fascinating battle ft. Harshit Rana & Abishek Porel#TATAIPL | #KKRvDChttps://t.co/1pX6tVytwF
— IndianPremierLeague (@IPL) April 29, 2024
అయితే.. హర్షిత్ తీరును మ్యాచ్ రిఫరీ తప్పుపడుతూ ఐపీఎల్ క్రమశిక్షణ కమిటీకి నివేదించాడు. కమిటీ ముందు హరషిత్ తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో, హైదరాబాద్‌పై ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్‌తో 60 శాతం ఫీజు కోల్పోయిన అతడికి ఈసారి పెద్ద ఝలకే తగిలింది. రెండోసారి లెవల్ 1 పొరపాటుకు పాల్పడినందున మ్యాచ్ ఫీజులో వంద శాతం కోతతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది.

పదిహేడో సీజన్లో రానా 8 మ్యాచుల్లో 11 వికెట్లు పడగొట్టాడు. సోమవారం ఢీల్లీని 7 వికెట్లతో చిత్తు చేసిన కోల్‌కతా రెండో స్థానం పదిలం చేసుకుంది. తదుపరి మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ బృందం మే 3న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

