Cheteshwar Pujara : భారత నయావాల్ ఛటేశ్వర్ పూజారా (Cheteshwar Pujara) మరో ఘనత సాధించాడు. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ అటాక్ ఉన్న కంగారులపై టెస్టుల్లో 2వేల పరుగులు చేశాడు. దాంతో, ఈ జట్టుపై రెండు వేలకు పైగా రన్స్ కొట్టిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పూజారా 42 రన్స్‌కు ఔట్ అయ్యాడు. ఆసీస్‌పై ఈ ఫార్మాట్లో 2,000లకు పైగా పరుగులు చేసిన వాళ్లలో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (sachin tendulkar) అగ్రస్థానంలో ఉన్నాడు.
ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ అధ్యక్షుడు వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman), ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇప్పటివరకూ పూజారా ఆసీస్‌పై 2,033 రన్స్ చేశాడు. ఆ జట్టుపై 24 టెస్టులు ఆడిన పూజారా 50.82 సగటుతో రాణించాడు. అతని ఖాతాలో 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
1. సచిన్ టెండూల్కర్ – ఆసీస్‌పై 39 టెస్టు మ్యాచుల్లో 3,630 పరుగులు చేశాడు.
2. వీవీఎస్ లక్ష్మణ్ – 29 మ్యాచుల్లో 2,434 రన్స్ కొట్టాడు.
3. రాహుల్ ద్రవిడ్ – 33 టెస్టుల్లో 2,166 పరుగులు సాధించాడు.
4. ఛటేశ్వర్ పూజారా – 24 మ్యాచుల్లో 2,033 రన్స్ కొట్టాడు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (Border – Gavaskar Trophy) సిరీస్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు ఇద్దరు మాత్రమే 2వేలకు పైగా రన్స్ చేశారు. రికీ పాంటింగ్ (2,555), మైఖేల్ క్లార్క్ (2,049) ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారు. కీలకమైన ఆఖరి టెస్టులో పూజారా, శుభ్‌మన్ గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 113 రన్స్ జోడించాడు. ఈ మ్యాచ్‌లో 42 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Milestone Alert 🚨@cheteshwar1 completes 2⃣0⃣0⃣0⃣ Test runs against Australia 👏👏
Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/c0YZL3j0yj
— BCCI (@BCCI) March 11, 2023