కోల్‌కతా : ఐపీఎల్-18 సీజన్ ఆరంభానికి ముందే కేకేఆర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా అతడు సీజన్ మొత్తానికి దూరమైనట్టు కేకేఆర్ తెలిపింది. ఈ సీజన్‌కు ముందు నిర్వహించిన వేలంలో ఉమ్రాన్‌ను రూ.75 లక్షల నామమాత్రపు ధరకు దక్కించుకున్న కేకేఆర్.. అతడి స్థానాన్ని చేతన్ సకారియాతో భర్తీ చేయనుంది.