పంజిమ్ (గోవా) : ప్రతిష్టాత్మక చెస్ ప్రపంచకప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు అర్జున్ ఇరిగేసి, పెంటెల హరికృష్ణ ప్రిక్వార్టర్స్‌కు చేరగా గత ఎడిషన్ రన్నరప్ ప్రజ్ఞానందకు మాత్రం నిరాశ ఎదురైంది. గురువారం జరిగిన నాలుగో రౌండ్ టైబ్రేక్‌లో మూడో సీడ్ అర్జున్.. 3-1తో హంగేరి వెటనర్ చెస్ ఆటగాడు పీటర్ లెకోను ఇంటిబాట పట్టించాడు.
రెండు ర్యాపిడ్ గేమ్స్‌లోనూ అతడు పూర్తి ఆధిపత్యం సాధించి ఐదో రౌండ్‌కు ముందంజ వేశాడు. మరో పోరులో హరికృష్ణ.. 2.5-1.5తో నిల్స్ గ్రెండెలియస్ (స్వీడన్)ను ఓడించాడు. తొలి టైబ్రేక్‌ను అతడు డ్రా చేసుకున్నా.. రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడి విజయం సాధించాడు. ప్రజ్ఞానంద మాత్రం రష్యా ఆటగాడు డానియల్ దుబోవ్ చేతిలో అపజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.