పంజీమ్(గోవా): చెస్ ప్రపంచకప్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ నిలకడైన ప్రదర్శన కొనసాగుతున్నది. మంగళవారం పీటర్ లెకో(హంగరీ)తో జరిగిన నాలుగో రౌండ్ తొలి గేమ్‌ను అర్జున్ డ్రా చేసుకున్నాడు. నల్లపావులతో బరిలోకి దిగిన అర్జున్..ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా ముందుకు సాగాడు. గేమ్ సాగుతున్నా కొద్ది లెకో నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాకపోవడం అర్జున్‌కు కలిసొచ్చింది.
మిగతా గేముల్లో యువ జీఎం ప్రజ్ఞానంద..డానియల్ దుబోవ్తో, హరికృష్ణ..నిల్స్ గ్రాండెనిల్స్తో, కార్తీక్ వెంకట్రామన్..లీ క్వాంగ్ లీమ్తో గేములను డ్రా చేసుకుని మెగాటోర్నీలో కొనసాగుతున్నారు. టోర్నీలో మిగిలిన నాలుగు రౌండ్లలో భారత ప్లేయర్ల గెలుపు, ఓటములపై ట్రోఫీ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.