Deepak Chahar | jaya bharadwaj | ఐపీఎల్ 2021లో భాగంగా ఇవాళ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాభవం చవిచూసింది. ధోనీసేనను పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒంటి చేత్తో ఓడించాడు. కానీ మ్యాచ్ పూర్తయిన తర్వాత కేఎల్ రాహుల్ కంటే కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్ చాహార్ ట్రెండింగ్‌లో నిలిచాడు. సోషల్ మీడియా మొత్తం చాహార్ గురించే మార్మోగుతుంది. అదేంటి.. ఒంటి చేత్తో టీంను గెలిచిన కేఎల్ రాహుల్ గురించి కాకుండా దీపక్ చాహార్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారని అనుకుంటున్నారా? మ్యాచ్ తర్వాత అతను చేసిన పనే ఇందుకు కారణం..
అసలేం జరిగిందంటే.. మ్యాచ్ అనంతరం స్టాండ్స్‌లో కూర్చొని ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్ జయ భరద్వాజ్ ( jaya bharadwaj ) దగ్గరికి వెళ్లాడు దీపక్ చాహార్ . అంతటితో ఆగకుండా ఆమె ముందు మోకాళ్ల మీద నిలబడి ప్రపోజ్ చేశాడు. స్టేడియంలో జనాలు అంతా చూస్తుండగా ఆమెకు రింగ్ తొడిగాడు. దీపక్ చాహార్ క్యూట్ ప్రపోజల్‌తో సర్ప్రైజ్కు గురైన తన గర్ల్‌ఫ్రెండ్ ఆనందంతో ఉప్పొంగిపోయింది. వెంటనే ఎస్ చెబుతూ అతన్ని కౌగిలించుకుంది. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
CSK vs pbks | చెలరేగిన కేఎల్ రాహుల్.. చెన్నైపై అలవోకగా గెలిచిన పంజాబ్
ధోనీ రిటైర్మెంట్.. టాస్ సందర్భంగా చెప్పకనే చెప్పిన మిస్టర్ కూల్!
టీ20 వరల్డ్‌కప్ నుంచి బ్యాట్స్‌మన్‌ను బ్యాటర్‌గా మార్చనున్న ఐసీసీ
ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో జీవిత.. మరి మోహన్ బాబును రాజశేఖర్ ఎందుకు కలిశారు? ఇదిగో క్లారిటీ