చెన్నై: చెన్నై చెస్ గ్రాండ్‌మాస్టర్స్ టైటిల్‌ను జర్మనీ కుర్రాడు విన్సెంట్ కెమెర్ సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో మరో రౌండ్ మిగిలున్నప్పటికీ ఎనిమిదో రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకున్న కెమెర్.. ఈ టోర్నీ మూడో సీజన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఎనిమిదో రౌండ్లో అతడు.. జోర్డాన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్)తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. 8వ రౌండ్ ముగిసేసరికి కెమెర్.. 6 పాయింట్లతో అగ్రస్థానాన్ని కొనసాగించాడు.
రెండో స్థానంలో ఉన్న భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి.. ఎనిమిదో రౌండ్ గేమ్నూ డ్రా చేసుకోవడంతో అతడి ఖాతాలో 4.5 పాయింట్లే ఉన్నాయి. చివరి రౌండ్లో అతడు గెలిచినా 5.5 పాయింట్ల వద్దే ఆగిపోతాడు.