Champions Trophy | న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీ (2025) ని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ఐసీసీ దాదాపు సిద్ధమైంది. దుబాయ్లో భారత్ మ్యాచ్ల నిర్వహణతో పాటు 2027 వరకు ఐసీసీ టోర్నీల్లో హైబ్రిడ్ పద్ధతి కొనసాగించేందుకు చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది.
గురువారం ఐసీసీ కొత్త చైర్మన్ జై షా, బోర్డు డైరెక్టర్లు దుబాయ్లో సమావేశమయ్యారు. పీసీబీ డిమాండ్ చేసిన అదనపు మొత్తానికి ఆమోదం లభించలేదని అని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.