Champions Trophy Final | చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు 69 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. కివీస్ డేంజరస్ బ్యాటర్ రచిన్ రవీంద్రను స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కుల్దీప్ తాను వేసిన తొలి ఓవర్.. తొలి బంతికే రచిన్‌ను పెవిలియన్‌కు పంపాడు. రచిన్ 29 బంతుల్లో నాలుగు ఫోర్లు.. ఒక సిక్సర్ సహాయంతో 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం కేన్ విలియమ్సన్ (10), డారిల్ మిచేల్ (2) క్రీజులో ఉన్నారు.