Champions Trophy | వచ్చ ఏడాది పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. ఈ వెంట్‌కు టీమిండియాను పంపేది లేదని భారత్ స్పష్టం చేసింది. టోర్నీని హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించాలని సూచించింది. ఈ ప్రతిపాదనకు మొదట ససేమిరా అన్నా.. ప్రస్తుతం ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. అయితే, పీసీబీ పలు డిమాండ్లను ఐసీసీ ఎదుట ఉంచింది. ఇందులో ఒకటి భవిష్యత్‌లో భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్స్ తాము సైతం హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తున్నది. అయితే, పీసీబీ ప్రతిపాదనపై అక్తర్ స్పందించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వివాదంలో భారత్, ఐసీసీ వైఖరిని తప్పుపట్టాడు. అయితే, భారత్‌కు వెళ్లకూడదన్న ప్రతిపాదనతో ఏకీభవించలేదు.
ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నందున ఆదాయంలో ఎక్కువ వాటా ఇవ్వాలన్న పీసీబీ స్టాండ్‌తో ఏకీభవించాడు మాజీ ఫాస్ట్‌బౌలర్. హోస్టింగ్ హక్కులు, ఆదాయం కోసం డబ్బులు చెల్లిస్తున్నందున తాము పరిస్థితిని అర్థం చేసుకున్నామని.. ఇందులో పాక్ వైఖరి సహేతుకమేనని పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోపీని నిర్వహించగలిగే.. వారు (భారత జట్టు) రావడానికి ఇష్టపడకపోతే పీసీబీతో ఆదాయాన్ని ఎక్కువ రేటుతో పంచుకోవాలని.. ఇది మంచి పిలుపేనన్నాడు. అయితే, భవిష్యత్తులో జరిగే ఐసీసీ టోర్నీల కోసం పీసీబీ పాకిస్థాన్ జట్టును భారత్‌కు పంపాలని అక్తర్ అభిప్రాయపడ్డాడు. భారత్‌ను సొంత మైదానాల్లోనే ఓడించేలా పాక్ జట్టును తీర్చిదిద్దాలన్నాడు.
‘భవిష్యత్తులో భారత్‌లో ఆడే విషయానికి వస్తే, మనం స్నేహ హస్తం చాచి అక్కడికి వెళ్లాలి. భారత్‌కు వెళ్లి అక్కడ వాళ్లను ఓడించాలి. భారత్‌తో ఆడండి.. అక్కడే వారిని ఓడించి తిరిగి రండి’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పీసీబీ అంగీకారం తెలిపిందని.. ఈ విషయంలో ఒప్పందం జరిగిందని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయి వేదికగా జరుగుతాయి. అయితే, భారత్ సెమీఫైనల్స్‌కు చేరితే ఒకటి పాక్‌లో, మరొకటి దుబాయిలో జరుగుతాయి. భారత్ ఫైనల్‌కు చేరితే ఫైనల్ సైతం దుబాయిలోనే జరుగుతుంది. ఒకవేళ భారత్ నాకౌట్ దశకు చేకపోతే సెమీఫైనల్స్, ఫైనల్ రెండూ పాక్‌లోనే నిర్వహిస్తారు.