Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రత్యేకంగా ఏమీ చేయాలనుకోవడం లేదని.. ఇంగ్లాండ్‌తో తొలి వన్డే తరహాలోనే వీలైనంత వరకు ఎక్కువగా ప్రయోగాలు చేయాలనుకుంటున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నారు. 249 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. స్కోర్ 235 వరకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. నిర్దిష్టమైన ప్రణాళిక ఏమీ లేదని.. జట్టుగా సాధ్యమైనంత వరకు సరైన పనులు చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా సాధ్యమైన ప్రతిదాన్ని ప్రయత్నించాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే చాలా వరకు విజయం సాధించామని.. చివరి వరకు వికెట్లను కోల్పోకూడదని అనుకుంటున్నట్లు చెప్పాడు.
దాదాపు ఆరు నెలల తర్వాత జట్టు వన్డే మ్యాచ్ ఆడుతున్నందున.. భారత జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తి చెందానని కెప్టెన్ పేర్కొన్నారు. చాలాకాలం తర్వాత ఈ ఫార్మాట్లో ఆడుతున్నామని అందరికీ తెలుసునని.. తాను చాలా సంతోషంగా ఉన్నానని.. వీలైనంత త్వరగా తిరిగి జట్టుగా కలిసి ఏం చేయాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని రోహిత్ తెలిపాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను రోహిత్ అభినందించాడు. అక్షర్ 47 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేసే స్పిన్నర్లు ఉన్నారు.. మైదానంలోనూ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ కావాలని కోరుకుంటున్నట్లు రోహిత్ పేర్కొన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా అక్షర్ మెరుగుయ్యాడని చెప్పారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఈ నెల 19 నుంచి మొదలుకాన్నది. దుబాయి వేదికగా టీమిండియా మ్యాచులు జరుగుతాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. 23న పాకిస్థాన్‌తో ఆడుతుంది.