Champions Trophy | పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీకి సందర్భంగా ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్సు ఉగ్రవాదులతో పాటు పలు సంస్థలు దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో.. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. చాలా రోజుల తర్వాత పాకిస్తాన్ వేదికగా ఐసీసీ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెటర్‌కు పాకిస్తాన్ సురక్షితమైన వేదికగా చాటిచెప్పేందుకు పాకిస్తాన్ బోర్డు ప్రయత్నిస్తుండగా.. భద్రతా ముప్పు పెను సవాల్‌గా మారింది. 2009లో శ్రీలంక క్రికెట్ జట్టుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పాకిస్తాన్ దశాబ్ద కాలంగా కీలకమైన అంతర్జాతీయ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వలేకపోయింది. తాజాగా చాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రవాదుల ముప్పు ఇబ్బందికరంగా మారింది.
ఓ మీడియా కథనం ప్రకారం.. పాక్ ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అడ్వైజరీ జారీ చేసింది. తెహ్రిక్-ఇ తాలిబాన్ పాకిస్తాన్ (TTP), ఐసిస్, బలూచిస్తాకు చెందిన పలు తీవ్రవాద గ్రూపులు టోర్నీకి హాజరయ్యే విదేశీ టూరిస్టులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. చాలా సంవత్సరాల తర్వాత పాకిస్తాన్లో క్రికెట్ ఆడేందుకు మళ్లీ వస్తున్నాయి. తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నది. తాజా భద్రతా సమస్యల నేపథ్యంలో పాకిస్తాన్ హై ఫ్రొఫైల్ టోర్నీలను నిర్వహించే సామర్థ్యంపై మరోసారి చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే భద్రతా కారణాలను చూపుతూ.. భారత్ ఆ దేశంలో పర్యటించేందుకు నిరాకరించింది. చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో దుబాయిలో మ్యాచులు ఆడుతున్నది. టీమిండియా మ్యాచులన్నీ దుబాయిలో జరుగుతుండగా.. మిగతా మ్యాచులకు పాకిస్తాన్ వేదికగా జరుగుతున్నాయి. ఇక నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు స్టేడియాలు, జట్లు బస చేసే హోటల్స్, ఇతర కీలక ప్రదేశాల్లో భద్రతను పటిష్టం చేశారు.
చాంపియన్స్ ట్రోపీలో ఆతిథ్య జట్టు పాకిస్తాన్ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దాంతో సెమీ ఫైనల్స్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి. పాకిస్తాన్ టోర్నీలో నిలువాలంటే.. బంగ్లాదేశ్‌పై విజయం సాధించాలి. అదే సమయంలో భారత్ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించాలి. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ కంటే ఎక్కువగా రన్ రేట్ ఉండేలా చూసుకోవాలి. సోమవారం బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ గెలిస్తే.. పాకిస్తాన్ అధికారికంగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. ఇప్పటికే ఆ జట్టు ప్రదర్శనతో పాకిస్తాన్ అభిమానులు నిరాశకు గురవుతుండగా.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రవాదుల ముప్పు వార్తలు ఆతిథ్య దేశానికి మరింత ఇబ్బందికరంగా మారాయి.