హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఫుట్‌బాట్ అసోసియేషన్ (టీఎఫ్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏ-డివిజన్ రహీమ్ లీగ్ 2025-26 లో ప్రముఖ శ్రీనిధి డెక్కన్ చాంపియన్‌గా నిలిచింది. స్థానిక డెక్కన్ ఎరీనా వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీనిధి.. 1-1తో ఆర్టీ బాయ్స్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నప్పటికీ.. లీగ్‌లో మొత్తంగా 13 మ్యాచ్‌లలో 34 పాయింట్లు సాధించిన ఆ జట్టు టైటిల్‌ను సొంతం చేసుకుంది. గత సీజన్ (2024-25)లో టీఎఫ్ఏ బీ-డివిజన్ లీగ్ గెలిచిన శ్రీనిధి.. ఈసారి ఏ డివిజన్‌లోనూ సత్తాచాటడం విశేషం.