BCCI | ఢిల్లీ: ఐపీఎల్-18 సందర్భంగా మైదానాల్లో అలరిస్తున్న ఏఐ రోబోటిక్ డాగ్ ‘చంపక్’ పేరు బీసీసీఐకి కొత్త తలనొప్పులను తీసుకొచ్చింది. ఈ సీజన్ 29వ మ్యాచ్ సందర్భంగా దీనిని ప్రవేశపెట్టిన బీసీసీఐ.. ఫ్యాన్ పోల్ ద్వారా దానికి చంపక్ అన్న పేరు పెట్టింది.
అయితే ఈ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చిన్నపిల్లల మ్యాగజైన్ ‘చంపక్’ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇది తమ ట్రేడ్మార్క్ ఉల్లంఘన అవుతుందని ‘చంపక్’ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. దీనిపై జూలై 9 నాటికి రాతపూర్వక వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐని కోర్టు ఆదేశించింది.