IPL 2025 : అహ్మదాబాద్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) వరుసగా కీలక వికెట్లు కోల్పోయింది. ఆకాశమే హద్దుగా ఆడిన హిట్టర్ సూర్యకుమార్ యాదవ్(44)ను సీనియర్ స్పిన్నర్ చాహల్ డగౌట్ చేర్చాడు. అతడి బౌలింగ్‌లో ఫోర్, సిక్సర్ బాదిన అతడు చివరకు.. మరో పెద్ద షాట్ ఆడే క్రమంలో ఔటయ్యాడు. లెగ్‌సైడ్ అతడు కొట్టిన బంతిని బౌండరీ వద్ద అందుకున్నాడు. దాంతో, ముంబై మూడో వికెట్ కోల్పోయింది.
స్ట్రాటజిక్ బ్రేక్ అనంతరం జేమీసన్ ఓవర్లో తిలక్ వర్మ(44) సైతం పెవిలియన్ చేరాడు. స్లో బౌన్సర్‌ను ఆడబోయిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. ప్రియాన్ష్ ఆర్య రన్నింగ్ క్యాచ్‌కు డగౌట్ బాట పట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం నమన్ ధిర్(2), హార్దిక్ పాండ్యా(2)లు క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లకు ముంబై స్కోర్.. 146 -4.
Shift in momentum, courtesy Chahal & Jamieson 🪄#PBKS bounce back strong with quick wickets of SKY & Tilak Varma ❤
Updates ▶ https://t.co/vIzPVlDqoC#TATAIPL | #PBKSvMI | #Qualifier2 | #TheLastMile | @PunjabKingsIPL pic.twitter.com/qb9B58EPJb
— IndianPremierLeague (@IPL) June 1, 2025