IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో దుమ్మరేపుతున్న పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు తొలి ఓటమి ఎదురైంది. వరుసగా రెండు విజయాలు సాధించిన ఆ జట్టు సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం పాలైంది. అయితే.. ఓటమికి తాము కుంగిపోవడం లేదని.. ఈసారి కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరుతామని అంటున్నాడు యజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal).
‘ఈ సీజన్లో మాది అత్యుత్తమ జట్టు. మా బ్యాటింగ్, బౌలింగ్ దళం ఎంతో పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌లో 10వ స్థానం వరకూ చెలరేగి ఆడగల ఆటగాళ్లు ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. 7 నుంచి 8 మంది బంతితో విజృంభించగలరు. అందుకే.. మా టీమ్ ఈసారి పాయింట్ల పట్టికలో టాప్ -2గా నిలుస్తుంది. దర్జాగా ప్లే ఆఫ్స్ ఆడుతుంది; అని వెల్లడించాడీ స్పిన్నర్. అంతేకాదు.. తనకు పంజాబ్ చెల్లిస్తున్న రూ.18 కోట్లకు న్యాయం చేస్తానని అన్నాడు చాహల్.
If Yuzi Chahal has 206 wickets in the IPL, just imagine the number of wickets Shaheen Afridi would have taken in the IPL 🇵🇰🇮🇳🥶 #TATAIPL pic.twitter.com/bkX9ZRpHFh
— Farid Khan (@_FaridKhan) April 6, 2025
టీ20 స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన చాహల్ భారత జట్టుకు దూరమై రెండేళ్లు కావొస్తోంది. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. అయినా సరే నిరాశ చెందని చాహల్ ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. నిరుడు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన అతడిని మెగా వేలంలో రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. 18వ సీజన్లో 3 మ్యాచ్‌లు ఆడిన చాహల్ ఒకే ఒక వికెట్ తీశాడు. అయితే.. తనకు భారీగా డబ్బులు చెల్లిస్తున్న ఫ్రాంచైజీ అంచనాలు నిలబెట్టుకుంటానని చెబుతున్నాడీ లెగ్ స్పిన్నర్.
RJ Mahvash shuts down dating rumours with Yuzvendra Chahal: “I’m very single & don’t do casual dates!”#RJMahvash #YuzvendraChahal #Whosthat360 pic.twitter.com/zCuKJ3xD3E
— WhosThat360 (@WhosThat360) April 3, 2025
వైవాహిక జీవితం విషయానికొస్తే.. ఈమధ్యే భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma) నుంచి విడాకులు తీసుకున్నాడు చాహల్. అభిప్రాయభేదాలతో విడిపోతున్నట్టు వెల్లడించాడు. బ్రేకప్ తర్వాత అతడు స్నేహితురాలు, రేడియో జాకీ అయిన మహ్వశ్తో సన్నిహితంగా ఉంటున్నాడు. టీమిండియా మ్యాచ్‌లను జంటగా వీక్షించిన ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, చాహల్, మహ్వశ్లు మాత్రం రిలేషన్షిప్లో ఉన్నామనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.