IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. హ్యాట్రిక్ ఓటములతో నిరాశపరిచిన కమిన్స్ సేన.. సొంత మైదానంలో గుజరాత్ టైటన్స్(Gujarat Titans)తో తలపడుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ సారథి శుభ్‌మన్ గిల్ బౌలింగ్ తీసుకున్నాడు. ఈ గేమ్ కోసం ఇరుజట్లు రెండు మార్పులు చేశాయి. వాషింగ్టన్ సుందర్ గుజరాత్ టీమ్‌లోకి రాగా.. హర్షల్ పటేల్ స్థానంలో జయదేవ్ ఉనాద్కాట్ను తీసుకుంది హైదరాబాద్.
ఈమ్యాచ్‌లో అయినా టాపార్డర్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాలని.. మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది హెస్ఆర్హెచ్. అయితే.. ఉప్పల్ స్టేడియంలో ఇరుజట్లకు ఇదే తొలి మ్యాచ్. కానీ, గత మూడు మ్యాచుల్లో హైదరాబాద్‌పై గుజరాత్‌దే పైచేయి. దాంతో, ఈసారి ఏం జరుగనుంది? అని అభిమానుల్లో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
🚨 Toss 🚨@gujarat_titans won the toss and opted to bowl first against @SunRisers
Updates ▶ https://t.co/Y5Jzfr6Vv4#TATAIPL | #SRHvGT pic.twitter.com/NSQEVcAiRt
— IndianPremierLeague (@IPL) April 6, 2025
హైదరాబాద్ తుది జట్టు : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనాద్కాట్, షమీ.
గుజరాత్ తుది జట్టు : సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సాయి కిశోర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.