WPL : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఐదు జట్లేనా? అని బోర్‌గా ఫీలవుతున్న అభిమానులకు గుడ్‌న్యూస్. ఈ మెగా టోర్నీలోకి త్వరలోనే మరో జట్టు రాబోతోంది. ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మహిళల క్రికెట్లో అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని మంగళవారం సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ (Kasi Viswanathan) వెల్లడించాడు. రాబోయే రోజుల్లో పసుపు జెర్సీ ప్రతాపం చూపిస్తామని ఆయన పేర్కొన్నాడు.
ఐపీఎల్‌తో టీ20ల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన బీసీసీఐ డబ్ల్యూపీఎల్‌తో మహిళల క్రికెట్ దశను మార్చేసింది. నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ లీగ్‌తో ప్రతిభావంతులైన అమ్మాయిలకు తగిన ప్రోత్సాహం, విశేష ఆదరణ లభించాయి. అయితే.. ఆరంభ సీజన్ నుంచి ఐదు జట్లే ఆడుతున్నాయి. ఐపీఎల్లో 10 జట్టు ఉండగా.. డబ్ల్యూపీఎల్‌లో మాత్రం ఐదేనా? అని నిట్టూర్చిన అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ తీపి కబురు చెప్పింది. త్వరలోనే తమ జట్టును పోటీలో నిలుపుతామని సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపాడు.
🚨 CSK TO INVEST IN WOMEN’S CRICKET. 🚨
– CSK CEO confirms the next step of CSK would be to invest in women’s cricket. (Revsportz). pic.twitter.com/zWjBP61rxl
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 3, 2026
మీ ఫ్రాంచైజీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటీ? అనే ప్రశ్నకు ‘డబ్ల్యూపీఎల్‌తో మహిళల క్రికెట్లోకి అడుగు వేస్తున్నాం. వెంటనే కాదు కానీ, కచ్చితంగా వచ్చే సీజన్లలో సీఎస్కే డబ్ల్యూపీఎల్‌లో బరిలోకి దిగుతోంది. క్రికెట్‌తో పాటు మరికొన్ని క్రీడల్లోనూ ప్రవేశిస్తాం’ అని సీఈవో కాశీ విశ్వనాథన్ పేర్కొన్నాడు.
నాలుగో సీజన్ మినీ వేలం సందర్భంగా డబ్ల్యూపీఎల్‌ను మరింత విస్తరించాలని భావిస్తున్నట్టు ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ జట్లు మహిళల క్రికెట్లో అడుగులు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతానికి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, ఆర్సీబీ, గుజరాత్ జెయింట్స్ మాత్రమే ఈ లీగ్‌లో ఆడుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు మాత్రం డబ్ల్యూపీఎల్‌లో ఇంకా అడుగుపెట్టలేదు.