బెంగళూరు: దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. బెంగళూరు వేదికగా నార్త్ ఈస్ట్‌తో జరుగుతున్న రెండో క్వార్టర్స్‌లో ఆ జట్టు.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఏకంగా 678 పరుగుల భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నార్త్ ఈస్ట్.. 185 పరుగులకే ఆలౌట్ అవగా సెంట్రల్ జోన్‌కు 347 పరుగుల ఆధిక్యం దక్కింది.
రెండో ఇన్నింగ్స్‌లో సెంట్రల్.. మూడో రోజు ఆట ఆఖరికి 331/7తో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో శుభమ్ శర్మ (122) సెంచరీతో చెలరేగాడు. ఇక నార్త్ జోన్, ఈస్ట్ జోన్ మధ్య జరుగుతున్న తొలి క్వార్టర్స్‌లో నార్త్ జట్టు సైతం 563 పరుగుల ఆధిక్యంలో ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ 230 పరుగులకే ఆలౌట్ అవగా నార్త్‌కు 175 రన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు.. 388/2తో మూడో రోజును ముగించింది. ఆ జట్టు సారథి అంకిత్ కుమార్ (168*), యశ్ ధుల్ (133) శతకాలు బాదారు.