MPCA : రాజకీయ నాయకుల వారసులు క్రికెట్లో పెత్తనం చెలాయించడం చూస్తున్నాం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కుమారుడు జై షా (Jai Shah) బీసీసీఐ కార్యదర్శి నుంచి ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఛైర్మన్ కుర్చీపై కూర్చోబోతున్నాడు. రాష్ట్రస్థాయి బోర్డుల్లోనూ పలువరు రాజకీయ పెద్దల కుమారులు అధ్యక్ష స్థానంలో ఉన్నారు. తాజాగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహనార్యమణ్ సింధియా (Mahanaryaman Scindia) మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం (MPCA) అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. గత పదేళ్లుగా వీళ్ల కుటుంబ సభ్యులే ఎంపీ క్రికెట్‌ను శాసిస్తున్నారు. ఇప్పుడు మూడోతరం ప్రతినిధిగా మహనార్యమణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా మహనార్యమణ్ను సోమవారం సభ్యులు ఎన్నుకున్నారు. ఎంపీసీఏ బాస్‌గా 29 ఏళ్ల సింధియా ఏకగీవ్రంగా ఎంపికైనట్టు చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రోహిత్ పండిట్ వెల్లడించాడు. దాంతో.. అత్యంత చిన్నవయసులోనే బోర్డు పగ్గాలు చేపట్టిన సింధియా సరికొత్త చరిత్ర లిఖించాడు.
#WATCH | Jyotiraditya Scindia becomes Minister of Communications and Minister of Development of North Eastern Region
Mahanaaryaman Scindia, son of Union Minister Jyotiraditya Scindia says, “I want to thank the public for giving us this chance and we will work towards development… pic.twitter.com/rSb2QnrsLb
— ANI (@ANI) June 10, 2024
68 ఏళ్ల ఆ రాష్ట్ర క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని రికార్డును మహనార్యమణ్ సొంతం చేసుకున్నాడు. గత మూడేళ్లుగా మహనార్యమణ్ మధ్యప్రదేశ్ క్రికెట్ కార్యకలాపాల్లో చరుకుగా పాల్గొంటున్నాడు. 2022లో అడు జీడీసీఏ ఉపాధ్యక్షుడిగా.. ఎంపీసీఏ జీవితకాల సభ్యుడిగా ఎంపికయ్యాడు. ఇంతకుముందు వీళ్ల తాత మధ్వవ్రావు సింధియా .. ఆ తర్వాత జ్యోతిరాదిత్య సింధియా ఎంపీసీఏ అధ్యక్షులుగా సేవలందించారు.