Smriti Mandhana : భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana)కు పెళ్లి కళ వచ్చేసింది. వరల్డ్ కప్ ముగియడమే ఆలస్యం ఆమె వివాహంపై మొదలైన వార్తలకు ఎట్టకేలకు ముగింపు పడింది. బాలీవుడ్ సింగర్ పలాశ్ ముచ్చల్ (Palash Mucchhal)తో గత ఆరేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న మంధాన నవంబర్ 23న అతడిని మనువాడనుంది. ఈ స్టార్ జంట పెళ్లి తేదీని ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా వెల్లడించారు. కల్యాణ వేడుకకు మరో మూడు రోజులు ఉండడంతో మంధాన తన నిశ్చితార్ధం ఉంగురాన్ని చూపిస్తూ మురిసిపోయింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది.
వరల్డ్ కప్ ఛాంపియన్ మంధాన పెళ్లి వార్త తెలిసినప్పటి నుంచి భారత మహిళా క్రికెటర్లు మస్త్ ఖుషీగా ఉన్నారు. వరల్డ్ కప్ సమయంలో ఒక్కచోట ఉండి సందడి చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం.. మంధాన పెళ్లిలో రచ్చ చేసేందుకు రెఢీ అవుతున్నారు. అందుకు శాంపిల్‌గా మంధాన తన ఎంగేజ్మెంట్ రింగ్‌ను చూపించిన వీడియోలో డాన్స్‌తో ఇరగదీశారు టీమిండియా స్టార్స్.
‘లగే రహో మున్నాభాయ్’ సినిమాలోని ‘సమ్జో హో హి గయా’ అనే పాటకు.. జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, అరుంధతీ రెడ్డి, శ్రేయాంక పాటిల్‌తో మంధాన హుషారుగా డాన్స్ చేసింది. వీడియో ఆఖర్లో తను తన ఎడమ చేతి వేళ్లను కెమెరాకు దగ్గరగా ఉంచింది. తన వేలికి ఉన్న నిశ్చితార్ధం ఉంగురం అందరికీ కనిపించేలా చూపించింది. డబ్ల్యూపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేసింది.
PM Narendra Modi wished Smriti Mandhana and Palash Muchhal on their engagement.
Also revealed the wedding date of the cricketer-composer couple in special note. #PMModi #SmritiMandhana https://t.co/vXtf4meO0a
— India Today Sports (@ITGDsports) November 20, 2025
‘స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ నవంబర్ 23న పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసి సంతోషిస్తున్నా. ఈ శుభసందర్భంగా ఇరుకుటుంబాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక్కరిగా ఉంటూ..ఒకరి సమక్షంలో ఒకరు ఐకమత్యంగా ఉంటూ సాగాలని కోరుకుంటున్నా. వారి లక్ష్యాలు నెరవేరాలని, జంటగా వృద్ధి సాధించాలని, పరస్పర అవగాహనతో వీరిద్దరి జీవితం ఆనందమయం కావాలని ఆశిస్తున్నా. మంధాన, పలాశ్లు నమ్మకంతో కొత్త జీవితాన్ని ఆరంభించనున్నారు. ఒకరికొకరు మద్దతుగా ఉంటూ, బాధ్యతగా వ్యవహరిస్తూ.. ప్రేమానురాగాలతో వర్ధిల్లాలి’ అని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.