హైదరాబాద్, ఆట ప్రతినిధి: గాడియం స్కూల్ వేదికగా సీబీఎస్ఈ జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్ పోటీలకు శనివారం తెరలేచింది. నాలుగు రోజుల పాటు జరుగనున్న టోర్నీలో దేశవ్యాప్తంగా 700 స్కూళ్ల నుంచి దాదాపు 1700 మందికి పైగా అథ్లెట్లు పోటీపడుతున్నారు.
టోర్నీ ప్రారంభ కార్యక్రమంలో గాడియం స్కూల్ ఫౌండర్, డైరెక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ గురుదయాల్సింగ్, కల్పన దేబ్నాథ్, మనోజ్ రానా, అశిష్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కీర్తిరెడ్డి మాట్లాడుతూ ‘దక్షిణ భారతదేశంలో సీబీఎస్ఈ జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నీ నిర్వహించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. 16,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒలింపిక్స్ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా జిమ్నాస్టిక్స్ కేంద్రాన్ని నిర్మించాము. ఇక్కడ రిథమిక్, ట్రాంపోలిన్, ఏరోబాటిక్ జిమ్నాస్టిక్స్లో శిక్షణ అందిస్తున్నాం’ అని అన్నారు.