Madrid Open : నార్వే టెన్నిస్ సంచలనం కాస్పర్ రూడ్(Casper Ruud) కెరీర్లో తొలి ఐటీపీ టైటిల్ కొల్లగొట్టాడు. సోమవారం ఉత్కంఠ రేపిన ఫైనల్లో అతడు బ్రిటన్‌కు చెందిన జాక్ డ్రాపర్(Jack Draper)పై విజయం సాధించాడు. స్పెయిన్ రాజధానిలో ఇరువురు హోరాహోరీగా తలపడ్డారు. అయితే.. మొదటి, చివరి సెట్ గెలుపొందిన రూడ్ 7-5, 3-6, 6-4తో ట్రోఫీని గెలుపొందాడు.
26 ఏళ్ల ఈ కుర్రాడికి ఇదే మొదటి మాస్టర్స్ 1000 టైటిల్. అంతేకాదు నార్వే తరఫున ఈ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి ఆటగాడు ఇతడే కావడం విశేషం. కెరీర్లో తొలి మాస్టర్స్ 1000 టైటిల్ విజేతగా నిలవడంతో పట్టలేనంత సంతోషంగా ఉన్నానని రూడ్ చెప్పాడు. ‘ఈమధ్య కాలంలో జాక్ డ్రాపర్ బాగా ఆడుతున్నాడని నాకు తెలుసు. అందుకే అతడిని ఓడించాలంటే నేను అత్యుత్తమంగా ఆడాలని నిర్ణయించుకున్నా. అనుకున్నట్టే మ్యాచ్‌లో అతడిపై పైచేయి సాధించాను’ అని స్పెయిన్ స్టార్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు.
POV: you watch Casper Ruud win the biggest title of his career 🥹❤️@MutuaMadridOpen | #MMOpen pic.twitter.com/ltO1nCL55Q
— ATP Tour (@atptour) May 4, 2025
ఇక డ్రాపర్ ఓటమితో కుంగిపోవడం లేదని అంటున్నాడు. ‘స్పోర్ట్స్ ఏదైనా సరే కష్టమైనదే. ఎందుకంటే వజియం కోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఫైనల్లో ఓడిపోవడం ద్వారా నన్ను నేను మెరుగయ్యే అవకాశం లభించింది’ అని డ్రాపర్ వివరించాడు. మహిళల విభాగంలో అరీనా సబలెంక విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా టీనేజర్ కోగో గాఫ్‌కు చెక్ పెడుతూ ఈ బెలారస్ బ్యూటీ వరుస సెట్లు గెలుపొందింది. తద్వారా సింగిల్స్‌లో డబ్ల్యూటీఏ టూర్లో 20వ తన ఖాతాలో వేసుకుంది.