Paris Olympics 2024 : ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) పారిస్ ఒలింపిక్స్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. వింబుల్డన్ విజేతగా టోర్నీలో అడుగుపెట్టిన అల్కరాజ్ పసిడి పతకా (Gold Medal)నికి అడుగు దూరంలో నిలిచాడు. పురుషుల డబుల్స్‌లో నిరాశపరిచిన ఈ స్పెయిన్ స్టార్ సింగిల్స్‌లో ఫైనల్ చేరాడు.
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఫెలిక్స్ అగర్ అలియస్మిమె (కెనడా)ను చిత్తుగా ఓడించాడు. గంటా 15 నిమిషాల మ్యాచ్‌లో 6-1, 6-1తో గెలుపొందాడు. గోల్డ్ మెడల్ పోరులో రెండో సెమీ ఫైనల్ విజేతతో అల్కరాజ్ తలపడనున్నాడు. మూడో సీడ్ నొవాక్ జకోవిచ్, లొరెంజో ముసెట్టిలు సెమీస్‌లో ఎదురుపడుతున్నారు.
MEDALLA! ❤️🇪🇸 Esto lo significa todo para mí, pero todavía queda el domingo! 🙏🏻 pic.twitter.com/0jG9wwIyo2
— Carlos Alcaraz (@carlosalcaraz) August 2, 2024
ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరడంపై అల్కరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. గోల్డ్ మెడల్ కోసం జరిగే పోరు తనకు ఎంతో ప్రత్యేకమని అన్నాడు. ‘ఒలింపిక్స్ ఫైనల్ నా జీవితంలో, నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన క్షణాలు. ఈ స్పెషల్ మూమెంట్స్‌ను నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఫైనల్ ఫైట్ చాలా కష్టంగా ఉండే అవకాశముంది’ అని అల్కరాజ్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. ఒకవేళ ఈ యంగ్‌స్టర్ స్వర్ణంతో మెరిస్తే చరిత్ర సృష్టించాడు. ఒకే సీజన్లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, ఒలింపిక్ మెడల్ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు పుటల్లో నిలుస్తాడు.