రోమ్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు జరుగుతున్న ఇటాలియన్ ఓపెన్‌లో అగ్రశ్రేణి ప్లేయర్లు కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్), కోకో గాఫ్ (అమెరికా) ఫైనల్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో మూడో సీడ్ అల్కరాజ్ 6-3, 7-6 (7/4)తో ముసెట్టి (ఇటలీ)ని చిత్తుచేసి ఫైనల్ చేరాడు.
మహిళల సింగిల్స్‌లో గాఫ్ 7-6 (7/3), 4-6, 7-6 (7/4)తో కిన్వెన్ జెంగ్ (చైనా)ను మట్టికరిపించింది. ఫైనల్లో గాఫ్..జాస్మిన్ పవులిని(ఇటలీ)తో తలపడనుంది.