SLW vs SAW : తొలి ఐసీసీ ట్రోఫీ వేటలో దక్షిణాఫ్రికా (South Africa) దూసుకుపోతోంది. వన్డే వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న సఫారీ టీమ్ సొంతగడ్డపై ఎలాగైనా బోణీ కొట్టాలనుకున్న శ్రీలంకను చిత్తు చేసింది. డక్‌వర్త్ లూయిస్ (DLS) ప్రకారం నిర్దేశించిన 121 పరుగుల ఛేదనలో లారా వొల్వార్డ్త్ (60 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. ఓపెనర్ తంజిమ్ బ్రిట్స్ (55 నాటౌట్)తో కలిసి లంక బౌలర్లను దంచేస్తూ బౌండరీలతో విరుచుకుపడింది. 15వ ఓవర్లో బ్రిస్స్ ఫోర్, సిక్సర్ బాదగా.. 10 వికెట్ల తేడాతో జయబేరి మోగించిన దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్‌కు చేరువైంది. మరోవైపు ఐదు మ్యాచుల్లో రెండు రద్దుకాగా.. మూడింటా ఓడిన లంక దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే.
వరల్డ్ కప్‌లో అదరగొడుతున్న దక్షిణాఫ్రికా నాలుగో విజయంతో సెమీస్ బరిలో నిలిచింది. ఛేదనలో తమకు తిరుగులేదని చాటుతున్న సఫారీ టీమ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకకు షాకిచ్చింది. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 105కే కట్టడి చేసింది దక్షిణాఫ్రికా. అనంతరం ఛేదనలో కెప్టెన్ లారా వొల్వార్డ్త్(60 నాటౌట్) దంచేసింది. తంజిబ్ బ్రిట్స్(55 నాటౌట్)తో కలిసి చెలరేగిన లారా.. క్లాసిక్ షాట్లతో అలరిస్తూ బంతిని బౌండరీకి తరలించింది. నాలుగు ఓవర్లకు ముగిసిన పవర్ ప్లేలో 25 రన్స్ రాబట్టారు.
A clinical W for South Africa ✅ #SLvSA scorecard: https://t.co/Gmw7BXwnvu pic.twitter.com/Y5zXQQwLtk
— ESPNcricinfo (@ESPNcricinfo) October 17, 2025
న్యూజిలాండ్‌పై మెరుపు సెంచరీ తర్వాత వరుసగా విఫలమైన బ్రిట్స్ సైతం కుదురుకున్నాక రణవీర ఓవర్లో సిక్సర్ కొట్టింది. 46 బంతుల్లోనే హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత కూడా ఇద్దరూ జోరు తగ్గించలేదు. 14వ ఓవర్ తొలి బంతిని లారా బౌండరీకి పంపగా స్కోర్ వంద దాటింది. ఆ తర్వాతి ఓవర్లోనే బ్రిట్స్ వరుసగా 4,6 తో అర్ధ శతకం పూర్తి చేసుకోగా సఫారీ జట్టు పది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడిన లారాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
వర్షం అంతరాయంతో ఐదు గంటలు ఆలస్యంగా సాగిన మ్యాచ్‌లో శ్రీలంక మోస్తరు రన్స్ చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 20 ఓవర్లకు కుదించడంతో.. మిడిలార్డర్ బ్యాటర్లు ధనాధన్ ఆడారు. విష్మీ గుణరత్నే(34), నీలాక్షి డిసిల్వా(18)లు బౌండరీలతో చెలరేగి జట్టు స్కోర్ దాటించారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 40 రన్స్ జోడించారు. అయితే.. మ్లాబా వేసిన ఆఖరి ఓవర్లో డిసిల్వా, అనుష్కా సంజీవని(1), గుణరత్నేలు ఔట్ కావడంతో.. నిర్ణీత ఓవర్లలో లంక 7 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేయగలిగింది.
విష్మీ గుణరత్నే(34)