T20 World Cup 2024 : ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ పోటీలకు ఇంకా పది రోజులే ఉంది. ఇప్పటికే దాదాపు అన్ని జట్లు తుది స్క్వాడ్‌ను ప్రకటించేశాయి. తాజాగా మొదటిసారి పొట్టి వరల్డ్ కప్ ఆడబోతున్న కెనడా (Canada) సైతం తుది స్క్వాడ్‌ను ప్రకటించింది. సోమవారం ఆదేశ క్రికెట్ బోర్డు సాద్ బిన్ జాఫర్(Saad Bin Jafar) కెప్టెన్‌గా 15మందితో కూడిన బృందాన్నిఎంపికచేసింది.
ఈ మోగా టోర్నీలో సీనియర్ల కంటే కుర్రాళ్లపైనే సెలెక్టర్లు నమ్మకం పెట్టుకున్నారు. అందుకనే కాబోలు తుది బృందంలోని 10 మంది 30 ఏండ్ల వయసులోపు వాళ్లు కాగా.. మిగతా ఐదుగురు 35 ఏండ్లు పైబడ్డవాళ్లు. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన సాద్ బిన్ నేతృత్వంలో కుర్రాళ్లు సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
🚨 TEAM CANADA Squad for the @icc @t20worldcup 🚨
Let’s go! 🇨🇦#t20worldcup #icc #cricketcanada pic.twitter.com/0CRjrMkwOL
— Cricket Canada (@canadiancricket) May 1, 2024
కెనడా వరల్డ్ కప్ స్క్వాడ్ : సాద్ బిన్ జాఫర్(కెప్టెన్), అరోన్ జాన్సన్, డిలాన్ హేలింగర్, దిల్‌ప్రీత్ బజ్వా, హర్ష్ థకెర్, జెరెమి గోర్డన్, జునైద్ సిద్దిఖీ, ఖలీమ్ సనా, కన్వర్పల్ తథ్గుర్, నవ్‌నీత్ ధలివాల్, నికోలస్ కిర్టన్, పర్గత్ సింగ్, రవీందర్‌పాల్ సింగ్, రయ్యన్ఖాన్ పఠాన్, శ్రేయాస్ మొవ్వ.
అంతర్జాతీయ క్రికెట్లో బుడిబుడి అడుగులు వేస్తున్న కెనడా ఐసీసీ టోర్నీకి అర్హత సాధించడమే గొప్ప విషయం. తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడుతున్న కెనడా గ్రూప్ ‘ఏ’ లో ఉంది. భారత్, అమెరికా, ఐర్లాండ్, పాకిస్థాన్ జట్లు సైతం ఇదే గ్రూప్‌లో ఉన్నాయి. జూన్ 1న జరిగే ఆరంభ పోరులో ఆతిథ్య అమెరికాతో కెనడా ఢీకొననుంది.