NZ vs AUS 1st Test | చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు.. పదో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం
NZ vs AUS 1st Test : న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(174 నాటౌట్) భారీ సెంచరీతో కంగారు జట్టును ఆదుకున్నాడు. దాంతో, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటయ్యింది. ఒకదశలో 267 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన కంగారూ..
NZ vs AUS 1st Test : న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(174 నాటౌట్) భారీ సెంచరీతో కంగారు జట్టును ఆదుకున్నాడు. దాంతో, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటయ్యింది. ఒకదశలో 267 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన కంగారూ జట్టు 383 రన్స్ చేసిందంటే అదంతా గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్(22) చలవే.
వీళ్లిద్దరూ 10వ వికెట్‌కు రికార్డు భాగస్వామ్యంతో న్యూజిలాండ్‌పై చరిత్ర సృష్టించారు. రెండో రోజు తొలి సెషన్లో కివీస్ బౌలర్లకు పరీక్షపెట్టిన ఈ ఇద్దరూ 116 పరుగులు జోడించారు. దాంతో, గతంలో జేసన్ గిలెస్పీ, గ్లెన్ మెక్‌గ్రాత్‌లు 2004లో నెలకొల్పిన రికార్డు బద్ధలైంది. గిలెస్సీ, మెక్‌గ్రాత్‌లు కివీస్‌పై 10వ వికెట్‌కు 114 రన్స్ కొట్టారు.
100 partnership up between Green & Hazlewood – New Zealand couldn’t have seen this coming #NZvAUS
— ESPNcricinfo (@ESPNcricinfo) February 29, 2024
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పేసర్ల ధాటికి 29 పరుగులకే ఐదు వికెట్లు పడడంతో టిమ్ సౌథీ సేన పీకల్లోతు కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికాపై సెంచరీల మోత మోగించిన స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్() అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిఫ్స్(69 నాటౌట్), మ్యాట్ హెన్రీ(27 నాటౌట్)లు కివీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోర్.. 159/7. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో టిమ్ సౌథీ సేన 224 పరుగులు వెనకబడి ఉంది.
ఇవి కూడా చదవండి
- Kane Williamson | అయ్యో విలియమ్సన్.. ఇలా రనౌట్ అయ్యావేంటీ.. వీడియో
- KTR | కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకే ‘చలో మేడిగడ్డ’: కేటీఆర్
- BRS | మేడిగడ్డ సందర్శనకు బయల్దేరిన బీఆర్ఎస్ బృందం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

