Chandrababu Naidu: వైఎస్ జగన్‌ను డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్‌తో పోల్చిన సీఎం చంద్రబాబు.. వీడియో
Chandrababu Naidu: డ్రగ్ అమ్మకాలతో ప్రపంచాన్ని వణికించాడు డ్రగ్‌లార్డ్ ఎస్కోబార్. ఆ కొలంబియా మాఫియా డాన్ తరహాలో వైఎస్ జగన్ వ్యవహరించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎస్కోబార్ ఓ నార్కో ఉగ్రవాది అని, రాజకీయవేత్తగా డ్రగ్ వ్యాపారం చేసినట్లు ఆరోపించారు.
అమరావతి: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu). కొలంబియా డ్రగ్ డాన్ పాబ్లో ఎస్కోబార్‌తో ఆయన్ను పోల్చారు. అసెంబ్లీలో మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై బాబు అటాక్ చేశారు. ఢిల్లీలో జగన్ చేపడుతున్న నిరసనను సీఎం బాబు వ్యతిరేకించారు. అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ.. పాబ్లో ఎస్కోబార్ .. కొలంబియా డ్రగ్ లార్డ్ అని, అతనో నార్కో ఉగ్రవాది అని, రాజకీయవేత్తగా మారిన ఆ డ్రగ్ వ్యాపారి.. ఆ తర్వాత తన కార్టెల్‌తో డ్రగ్స్‌ను అమ్ముకున్నట్లు చెప్పారు. ఆ సమయంలో అతను 30 బిలియన్ల డాలర్లు ఆర్జించినట్లు వెల్లడించారు. ఇప్పుడు ఆ డ్రగ్ సేల్ విలువ సుమారు 90 బిలియన్ల డాలర్లు ఉంటుందని బాబు తన ప్రసంగంలో తెలిపారు.
1976లో మొదటిసారి పాబ్లో ఎస్కోబోర్ను అరెస్టు చేశారని, కానీ 1980లో అతను ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన డ్రగ్ కింగ్‌పిన్‌గా అవతరించినట్లు చంద్రబాబు తెలిపారు. డ్రగ్స్ అమ్ముతూ ఎవరైనా సంపన్నులు కావచ్చు అని సీఎం తన ప్రసంగంలో పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యం ఏంటని, టాటా, రిలయన్స్,అంబానీల కన్నా ఎక్కువ సంపన్నుడు కావాలని అలా చేసినట్లు చంద్రబాబు ఆరోపించారు. కొందరికి అవసరాలు ఉంటాయని, కొందరికి కోర్కెలు ఉంటాయని, కొందరికి పిచ్చి ఉంటుందని, పిచ్చి పట్టినవాళ్లే ఇలాంటి దందాలకు పాల్పడుతుంటారని చంద్రబాబు తన ప్రసంగంలో తెలిపారు.
జగన్ రెడ్డి లాంటి వాడిని, నేను నా 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో చూడలేదు. మీరు ఎవరైనా చూసారా ?
పదవి అడ్డు పెట్టుకుని ఒక కిమ్ మాదిరిగా నియంతలా, ఒక పాబ్లో ఎస్కోబార్ లాగా నేరసామ్రాజ్యాన్ని సృష్టించి ఎదగాలని జగన్ రెడ్డి చూసాడు.#NaraChandrababuNaidu #APAssembly #AndhraPradesh pic.twitter.com/yl49d4wsEz— Telugu Desam Party (@JaiTDP) July 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

