KTR | ఇది డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన దోకేబాజ్ బడ్జెట్ : కేటీఆర్
KTR | రాష్ట్ర బడ్జెట్ గ్యారెంటీలను గంగలో కలిపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని, ఇది పూర్తిగా కోతల, ఎగవేతల బడ్జెట్ ఆయన మండిపడ్డారు.
KTR : రాష్ట్ర బడ్జెట్ గ్యారెంటీలను గంగలో కలిపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని, ఇది పూర్తిగా కోతల, ఎగవేతల బడ్జెట్ ఆయన మండిపడ్డారు. ఈ బడ్జెట్లో ఎన్నికల వాగ్ధానాలను గాలికి వదిలేసి ప్రజలను వంచించారని ఆరోపించారు. ఇది డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన దోకేబాజ్ బడ్జెట్ అని ఫైరయ్యారు.
ఈ బడ్జెట్‌కు ఒక విధానంగానీ, విషయంగానీ, విజన్‌గానీ లేదని.. కేవలం పథకాల పేర్ల మార్పులతో ఏమార్చారని కేటీఆర్ విమర్శించారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని, అన్నదాతలకు సున్నం పెట్టారని ఆరోపించారు. దళితులను దగా చేశారని, గిరిజనులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలకు ఇచ్చిన మాటలన్నీ నీటి మూటలయ్యాయని మండిపడ్డారు.
ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు..!
గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్..!
వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్..!
డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన…దోకేబాజ్ బడ్జెట్..!
విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతో
ఏమార్చిన డొల్ల బడ్జెట్..!రైతులకు…
— KTR (@KTRBRS) July 25, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

