న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్(MP Harbhajan Singh) ఇవాళ మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా క్వశ్చన్ అవర్ కోసం నోటీసులు ఇచ్చానని, కానీ తనకు మాట్లాడే అవకాశం రాలేదని హర్భజన్ పేర్కొన్నాడు. అమృత్సర్ విమానాశ్రయాన్ని విస్తరించాలన్నదే తన డిమాండ్ అని తెలిపాడు. అమృత్సర్ నుంచి అమెరికాకు లేదా కెనడాకు డైరెక్ట్ ఫ్లయిట్ లేదని, పంజాబీ ప్రజలు తొలుత ఢిల్లీకి రావాల్సి వస్తోందన్నాడు. ఇండియా, కెనడా మధ్య విమాన సర్వీసులను పెంచాలని అగ్రిమెంట్ జరిగిందని, కానీ ఆ ఒప్పందంలో అమృత్సర్ గురించి ప్రస్తావించలేదన్నారు.
నీతి ఆయోగ్ మీటింగ్‌ను ప్రతిపక్షాలు బహిష్కరించాయన్న అంశంపై మాట్లాడుతూ.. భగవంత్ మాన్‌తో పాటు ఇతర పెద్ద నేతలు మాట్లాడిన విషయాలను పరిశీలించానని, బడ్జెట్ సంతృప్తికరంగా లేదన్న విషయం వాస్తవమే అని, పార్టీ తీసుకున్న స్టాండ్‌కు కట్టుబడి ఉన్నామని, నిరసన చేస్తున్న రైతులకు ఏం మిగిలిందని అడిగారు. ఒకటి లేదా రెండు రాష్ట్రాలకు తప్ప ఈ బడ్జెట్‌తో ఎవరికీ ఏమీ జరగలేదని అన్నారు.
#WATCH | Rajya Sabha MP Harbhajan Singh says, “In the last three days, I have submitted a notice for the question hour but I didn’t get the opportunity to speak. My issue was to expand Amritsar airport. Since there is no direct flight from Amritsar to America or Canada, the… pic.twitter.com/tc7d5wHcwj
— ANI (@ANI) July 25, 2024